Varalaxmi Sarath Kumar : వరలక్ష్మీ శరత్ కుమార్ ఆ స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుతో పెళ్లి పీటలు ఎక్కబోతుందా?

NQ Staff - March 7, 2023 / 09:09 PM IST

Varalaxmi Sarath Kumar : వరలక్ష్మీ శరత్ కుమార్ ఆ స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుతో పెళ్లి పీటలు ఎక్కబోతుందా?

Varalaxmi Sarath Kumar : టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ విలన్ గా పేరు తెచ్చుకుని ఆమె పేరు మార్మోగి పోయేలా చేసుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ప్రెజెంట్ ఎక్కడ చుసిన ఈ హీరోయిన్ పేరు బాగా వినిపిస్తుంది.. తమిళ్ లో హీరోయిన్ గా చేసి తెలుగులో లేడీ విలన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మోస్ట్ వాంటెండ్ లేడీ విలన్ గా మన ఇండస్ట్రీలో రాణిస్తుంది. హీరోలకు మించిన స్టార్ డమ్ అందుకుని అందరి చేత తన నటనకు ప్రశంసలు అందుకుంటుంది..

హీరోలతో పోటీ పడి మరీ నటిస్తూ వారికీ చెమటలు పట్టిస్తుంది.. దీంతో ఈమెకు ఏకంగా ప్రత్యేకమైన క్యారెక్టర్లు సైతం రాస్తున్నారు డైరెక్టర్లు.. మరి అంతగా విలక్షణ మైన నటనతో ఆకట్టు కుంటున్న ఈమె పెళ్లి వార్తలు నెట్టింట ప్రెజెంట్ హాట్ టాపిక్ అవుతున్నాయి.. ఈమె ఒక స్టార్ ప్రొడ్యూసర్ ఇంటికి కోడలు కాబోతుంది అంటూ ఒక వార్త వినిపిస్తుంది. ఇది నెట్టింట ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

అసలు ఈ వార్త ఎలా వచ్చింది ? అసలు విషయం లోకి వెళ్తే.. నటుడు శరత్ కుమార్ కూతురుగా ఈమె ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి హీరోయిన్ గా చేసి ఆ తర్వాత ఎక్స్పోజింగ్ చేయడం ఇష్టంలేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పోయింది.. అయితే హీరోయిన్ గా గుర్తింపు పొందలేని ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రం మంచి పేరు తెచ్చుకుంది..

ఎప్పుడైతే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి ఈమె దశ తిరిగి పోయింది అనే చెప్పాలి.. ఇక ఈ హీరోయిన్ కి ఇంత ఏజ్ వచ్చినా ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా అలానే ఉంది. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం స్టార్ ప్రొడ్యూసర్ తన ఇంటికి కోడలుగా తీసుకొచ్చుకోవాలని చూస్తున్నారట.. ఈ విషయం వరలక్ష్మి తండ్రికి కూడా చెప్పి వియ్యంకులుగా మారిపోదాం అని అంటే ఆయన కూడా ఒప్పుకున్నారట.. మరి ఈ పెళ్లి వార్తల విషయంలో ఈమె ఎలా స్పందిస్తుందో చూడాలి..

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us