Varalakshmi Sarathkumar : విజృంభిస్తున్న క‌రోనా.. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌కు పాజిటివ్

NQ Staff - July 17, 2022 / 06:55 PM IST

Varalakshmi Sarathkumar  : విజృంభిస్తున్న క‌రోనా.. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌కు పాజిటివ్

Varalakshmi Sarathkumar  : దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తుంది. మొన్న‌టి వ‌ర‌కు శాంతంగా ఉన్న క‌రోనా ఇప్పుడు బుస‌లు కొడుతుంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీల‌ని సైతం వ‌ణికిస్తుంది. చాలా మంది సెల‌బ్స్ క‌రోనా బారిన ప‌డుతుండ‌గా, అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.

క‌రోనా ఎఫెక్ట్..

లేడి విల‌న్‌గా గుర్తింపు తెచ్చుకున్న వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ తాజాగా కొవిడ్ బారిన ప‌డింది. మాస్క్ ధ‌రించ‌డంతో పాటు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా తనకు క‌రోనా వ‌చ్చిన‌ట్లు చెప్పింది. కొవిడ్ పూర్తిగా తొల‌గిపోలేద‌ని,అంద‌రూ త‌ప్ప‌కుండా మాస్క్ ధ‌రించాల‌ని తెలిపింది.

Varalakshmi Sarathkumar Recently Infected Covid

Varalakshmi Sarathkumar Recently Infected Covid

న‌టీన‌టుల‌కు షూటింగ్‌ల‌లో మాస్క్ ధ‌రించి న‌టించ‌డం కుద‌ర‌ద‌ని,వారు సేఫ్‌గా ఉండాలంటే మిగిలిన యూనిట్ స‌భ్యులు విధిగా మాస్క్ ధ‌రిస్తే బాగుంటుంద‌ని ట్విట్ట‌ర్ ద్వారా సూచించింది. అలా చేసిన‌ప్పుడే అంద‌రూ సేఫ్‌గా ఉండ‌టానికి అవ‌కాశం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది వ‌ర‌ల‌క్ష్మీ.

వరలక్ష్మి శరత్ కుమార్ కరోనా బారిన పడటం ఇది రెండోసారి . 2012లో శింబు హీరోగా రూపొందిన పోడాపోడి సినిమాతో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది. హీరోయిన్‌గా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో విల‌న్ పాత్ర‌ల‌పై దృష్టిపెట్టింది. శరత్‌‌కుమార్ కూతురుగా హీరోయిన్‌‌‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి.. అయితే హీరోయిన్‌‌గా క్లిక్ కాలేకపోయింది కానీ నెగెటివ్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్‌‌తో స్టార్ స్టేటస్‌‌ను మాత్రం సంపాదించుకుంది.

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us