Varalakshmi Sarath Kumar : పెళ్లి అనేది ఒక బూతు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మీ..!
NQ Staff - June 7, 2023 / 11:02 AM IST

Varalakshmi Sarath Kumar : వరలక్ష్మీ శరత్ కుమార్ ఇప్పుడు లేడీ విలన్ పాత్రలకు పెట్టింది పేరు. క్రాక్, వీరసింహారెడ్డి సినిమాల్లో ఆమె విలనిజం చూసి అంతా షాక్ అయిపోయారు. ఇంత పీక్స్ లో నటించడం అంటే మాటలు కాదనే చెప్పుకోవాలి. ఇలాంటి సమయంలో ఆమె తెలుగు సినిమాలపై బాగానే ఫోకస్ పెట్టింది. అటు తమిళంలో కూడా బాగానే అవకాశాలు వస్తున్నాయి.
అయితే వరలక్ష్మీ శరత్ కుమార్ వయసు పెరుగుతున్నా సరే ఇంకా పెండ్లి చేసుకోవట్లేదు. సింగిల్ గానే లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఆమె గతంలో హీరో విశాల్ తో ప్రేమలో ఉందని, ఇద్దరూ పెండ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ దానిపై తర్వాత ఎవరూ స్పందించలేదు. అయితే తాజాగా వరలక్ష్మీ ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న సిక్త్స్ సెన్స్ ప్రోగ్రామ్ కు వచ్చింది.
ఇందులో బిందు మాధవితో కలిసి హాజరయింది. వీరిద్దరికీ పెళ్లిపై ప్రశ్న వేశాడు ఓంకార్. వరలక్ష్మీ స్పందిస్తూ క్రాస్ ఫింగర్ ను చూపించింది. అంటే తన దృష్టిలో పెళ్లి అనేది ఓ బూతు అని చెప్పింది. పెళ్లి అనేది అన్నింటికీ పరిష్కారం అనుకుంటాం కానీ.. మన పార్ట్ నర్ ను అర్థం చేసుకునే మైండ్ డెవలప్ మెంట్ మనకు ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి.
అంతే తప్ప తొందరపడి పెళ్లి చేసుకోకూడదు అంటూ తెలిపింది వరలక్ష్మీ. ఇక బిందు మాధవి స్పందిస్తూ ఎవరో తొందరపెడితే పెళ్లి చేసుకోవద్దు. మనకు నచ్చినప్పుడే చేసుకోవాలి అంటూ తెలిపింది. అయితే వరలక్ష్మీ చేసిన కామెంట్లు ఇప్పుడు వివాదాస్పదంగా మారిపోయాయి. ఆమెపై అందరూ విమర్శలు చేస్తున్నారు.