Valtheru Veerayya Movie : మెగాస్టార్ చిరంజీవి ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.! మళ్ళీ ఆనాటి ‘కళ’.!
NQ Staff - October 19, 2022 / 05:35 PM IST

Valtheru Veerayya Movie : మెగాస్టార్ చిరంజీవితో బాబీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ప్రచారంలో వుంది. ‘గాడ్ ఫాదర్’ ఒకింత సీరియస్ సినిమా. అందులో కామెడీకి స్కోప్ లేదు, ఫక్తు కమర్షియల్ పాటలకీ అవకాశం లేదు.
‘గాడ్ ఫాదర్’ సినిమా బాగానే వుంది.. కానీ, కమర్షియల్ సినిమాకి వుండాల్సిన లక్షణాలు లేవన్న విమర్శ వినిపించింది. నిజానికి, ఫక్తు కమర్షియల్ సినిమాలు ఈ మధ్య నిలబడటంలేదు. కంటెంట్ వున్న సినిమాల్లో కమర్షియల్ అంశాల గురించి ప్రేక్షకులూ ఆలోచించడం లేదు.
వాల్తేరు వీరయ్య సంగతేంటి.?
మెగాస్టార్ చిరంజీవిని చాన్నాళ్ళ తర్వాత పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్‌లో చూడబోతున్నామంటూ ‘వాల్తేరు వీరయ్య’ గురించి ప్రచారం జరుగుతోంది. సెట్స్‌లో చిరంజీవి ఎనర్జీని చూసి అంతా అవాక్కవుతున్నారట. సెట్స్‌లో నిత్యం సందడి వాతావరణం కనిపిస్తోందని ఇన్‌సైడ్ సోర్సెస్ చెబుతున్నాయి.
‘అల్లుడా మాజాకా’, ‘ఘరానా మొగుడు’ తదితర సినిమాల్లోని ఫన్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చూడబోతున్నామన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. చిరంజీవి కూడా ఈ సినిమాపై ఆ యాంగిల్‌లోనే స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ సినిమా ముందు అనుకున్నట్లు సంక్రాంతికే విడుదలవుతుందా.? లేదా.? అన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది. సంక్రాంతికి వస్తే మాత్రం.. మాస్ జాతరే.!