Vaarasudu Movie : ఒకటీ.. రెండూ.. మూడూ.! ఇది విజయ్ తెచ్చిన ట్రెండూ.!

NQ Staff - June 22, 2022 / 09:00 PM IST

Vaarasudu Movie : ఒకటీ.. రెండూ.. మూడూ.! ఇది విజయ్ తెచ్చిన ట్రెండూ.!

Vaarasudu Movie : ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు లుక్స్.. ‘వారిసు’ సినిమాకి సంబంధించి ఇదొక నయా ట్రెండ్ అనుకోవాలేమో. ప్రముఖ తమిళనటుడు ‘దళపతి’ విజయ్ పుట్టినరోజు నేపథ్యంలో, విజయ్ అభిమానులకు ‘వారిసు’ టీమ్ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు బహుమతుల్ని ఇచ్చేసింది.

Vaarasudu Movie New Looks Release

Vaarasudu Movie New Looks Release

నిన్న టైటిల్‌తోపాలు ఓ ఇంట్రెస్టింగ్ క్లాస్ లుక్ రివీల్ చేసిన ‘వారిసు’ టీమ్, తాజాగా నేడు మరో రెండు లుక్స్ విడుదల చేయడం గమనార్హం. ఉదయాన్నే ఒకటి, సాయంత్రం ఇంకోటి.. వెరసి, ఇప్పటికి మొత్తంగా మూడు లుక్స్ వచ్చాయి.

అక్కడ ‘వారిసు’, ‘ఇక్కడ ‘వారసుడు’

తమిళంలో ‘వారిసు’, తెలుగులోనేమో ‘వారసుడు’. ఈ సినిమాకి టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కన్నడ కస్తూరి, నేషనల్ క్రష్ రష్మిక మండన్న తొలిసారిగా విజయ్ సరసన ఈ సినిమాలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తోంది.

Vaarasudu Movie New Looks Release

Vaarasudu Movie New Looks Release

ఇప్పటివరకూ హీరోల పుట్టినరోజు సందర్భంగా ఒకటీ లేదా రెండు లుక్స్ మాత్రమే విడుదల చేస్తుండేవారు. ఇకపై కొత్త ట్రెండ్‌ షురూ అయ్యిందనుకోవాలేమో.

Vaarasudu Movie New Looks Release

Vaarasudu Movie New Looks Release

ఇంతకీ, ‘వారిసు’ అదేనండీ ‘వారసుడు’ టీమ్ మూడుతో ఆపేస్తుందా.? ఇంకో లుక్ ఏమైనా ఈ రోజు మిగిలిన సమయంలో విడుదల చేస్తుందా.? జస్ట్ వెయిట్ అండ్ సీ. తాజా లుక్, మాస్ అప్పీల్‌తో డిజైన్ చేశారు. మూడు లుక్స్‌లోనూ వంశీ పైడిపల్లి మార్కు స్పష్టంగా కనిపిస్తోంది.

Vaarasudu Movie New Looks Release

Vaarasudu Movie New Looks Release

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us