Urvashi Rautela : రెడ్ హాట్ ఊర్వశి రౌతెలా.! క్యూట్ అండ్ హాట్.! సొగసు చూడతరమా.!
NQ Staff - November 1, 2022 / 07:05 AM IST

Urvashi Rautela : అందానికి కేరాఫ్ అడ్రస్ అయిన రంభ, ఊర్వశి, మేనకల్లోంచి.. తప్పిపోయి, ఊర్వశి భూలోకానికి చేరిందా.? అంటే నిజమే అనిపిస్తుంది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలాని చూస్తే. అంతటి అందం ఆమె సొంతం మరి.
అయితే, అందం ఒక్కటే వుంటే సరిపోదు కదా.. అదృష్టం కూడా వుండాలి. ఆ ఒక్కటే కాస్త తక్కువయ్యింది ఊర్వశి రౌతెలాకి. అందుకే, అంతటి అందాల అపురూప సౌందర్యవతి అయినప్పటికీ, స్టార్ హీరోయిన్ అనిపించుకోలేకపోతోంది ఊర్వశి రౌతెలా.

Urvashi Rautela new red dress photos
‘లెజెండ్’ గ్లామర్ టాలీవుడ్‌కి.!
ఇటీవలే ‘ది లెజెండ్’ అంటూ ప్రముఖ బిజినెస్ మేన్ శరవణన్ సినిమాలో హీరోయిన్‌గా నటించి, కోట్లలో రెమ్యునరేషన్, విలువైన బహుమతులు పట్టేసింది ఊర్వశి రౌతెలా.
ఆ సినిమాతో సౌత్ ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది కూడా. ఇక, తాజాగా తెలుగు తెరపైనా ఊర్వశి తళుకులు జిగేల్‌మని మెరిసే టైమొచ్చింది.
రామ్ పోతినేని, బోయపాటి శీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో ఊర్వశి రౌతెలా స్పెషల్ ఛాన్స్ కొట్టేసింది. రామ్‌తో స్పెషల్‌గా స్టెప్పులేసేందుకు ఊర్వశి రౌతెలా రెడీ అవుతున్నట్లు ఇటీవలే కన్‌ఫామ్ అయ్యింది.
అన్నట్లు గతంలోనే ఊర్వశి రౌతెలా ‘బ్లాక్ రోజ్’ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా స్టేటస్ ఏంటో ఇంతవరకూ తెలీదు. కానీ, ‘నా తప్పు ఏమున్నదబ్బా.’ అంటూ సాగే ఆ సినిమాలోని సాంగ్ మాత్రం తెగ ఫేమస్ అయిపోయిందిలే.!
తాజాగా రెడ్ హాట్ లుక్స్‌లో ఊర్వశి రౌతెలా సోషల్ తెరని తన సొగసుల సునామీలో ముంచేసేందుకు సిద్ధమైంది. ఆ సునామీలో కొట్టుకుపోవాలంటే, ఈ పిక్స్‌పై ఓ లుక్కేస్కోండి చూద్దాం.!

Urvashi Rautela new red dress photos