Upasana Konidela : మీకేం తెలుసురా నా కష్టం.. వాళ్లపై సీరియస్ అయిన ఉపాసన..!
NQ Staff - February 23, 2023 / 11:00 AM IST

Upasana Konidela : మెగా కోడలు ఉపాసనకు ఉన్న ఫాలోయింగ్ హీరోయిన్ల రేంజ్ లో ఉంటుంది. ఎందుకంటే ఆమె తన పనులతో ఎప్పటికప్పుడు మెగా ఫ్యాన్స్ మనసులను గెలుచుకుంటూనే ఉంది. చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. ఉపాసనను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. ఉపాసన అపోలో హాస్పిటల్స్ అధినేత మనవరాలుగా అందరికీ సుపరిచితం.
కాగా ఆమె చాలా వరకు సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటుంది. తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ఉంటుంది ఈమె. అందుకే ఆమెను అంతా మెగా ఫ్యామిలీకి తగ్గ కోడలుగా కీర్తిస్తున్నారు. ఇక పెండ్లి అయిన పదేండ్లకు ఉపాసన ప్రెగ్నెంట్ కాబోతోందనే విషయం మెగా ఫ్యామిలీలో సంతోషం నింపేసింది.
నెగెటివ్ కామెంట్లు..
ఇదిలా ఉండగా.. ఉపాసన బి పాజిటివ్ అనే మ్యాగజైన్‌కు ఎడిటర్ గా కూడా పని చేస్తోంది. ఈ క్రమంలోనే ఉపాసనపై కొందరు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఉపాసన గోల్డెన్ స్పూన్ తో పుట్టిందని వేల కోట్లకు వారసురాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఏ పని చేయకపోయినా హ్యాపీగా బతికేస్తోంది అంటున్నారు.
అయితే ఈ మాటలపై ఉపాసన ఘాటుగా స్పందించింది. కొందరు నన్ను గోల్డెన్ స్పూన్ తో పుట్టానని కామెంట్లు చేస్తున్నారు. కానీ మా తల్లిదండ్రులు ఎంత కష్ట పడ్డారో మర్చిపోతున్నారు. నేను కూడా ఖాళీగా ఉండకుండా నా వృత్తి బాధ్యతలతో బిజీగా గడుపు తున్నాను. నా పిల్లలను కూడా వృత్తి బాధ్యతలతో పెంచుతాను అంటూ తెలిపింది ఉపాసన.