Balakrishna : బాలయ్యకు భారీ షాక్ ఇచ్చిన నాగార్జున.. అన్ స్టాపబుల్ షో ఆగిపోనుందా..?
NQ Staff - January 25, 2023 / 10:59 AM IST

Balakrishna : బాలయ్య గురించి అందరికీ తెలిసిందే. ఆయన మైక్ పట్టుకుంటే ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. అప్పుడప్పుడు అనవసరంగా నోరు జారి విమర్శలు పాలు అవుతుంటాడు. తాజాగా ఆయన నటించిన వీరసింహారెడ్డి మంచి హిట్ అయింది. ఈ క్రమంలోనే ఆయన సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ నోరు జారాడు. తన పక్కనున్న ఓ వ్యక్తి గురించి చెప్పబోతూ తానేం మాట్లాడుతున్నానో ఆయనే మర్చిపోయాడు.
ఆ రంగారావు, ఈ రంగారావు, ఈ అక్కినేని తొక్కినేని అంటూ మాట్లాడాడు. దాంతో అక్కినేని ఫ్యామిలీ ఈ విషయం మీద చాలా సీరియస్ గా ఉంది. అక్కినేని నాగేశ్వర్ రావు వర్థంతి రోజే ఆయన్ను ఇలా దారుణంగా అవమానిస్తావా అంటూ బాలయ్య మీద చాలా సీరియస్ అవుతున్నారు అక్కినేని ఫ్యాన్స్.
నాగార్జున సంచలన నిర్ణయం..
కాగా ఇదే విషయంపై అక్కినేని నాగచైతన్య, అఖిల్ సీరియస్ గా స్పందించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావును అవమానించడం అంటే మనల్ని మనమే కించ పరుచుకోవడం అంటూ తెలిపారు. అయితే బాలయ్య ఇంకా స్పందించక పోవడంతో నాగార్జున ఓ నిర్ణయం తీసుకున్నాడంట. ఇన్ని రోజులు బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోను అన్నపూర్ణ స్టూడియోలోనే షూట్ చేశారు.
ఇక తర్వాత ఎపిసోడ్లకు మాత్రం బాలయ్యను అన్నపూర్ణ స్టూడియోలోకి ఆహ్వానించడానికి వీళ్లేదంటూ తెలిపాడంట. ఈ విషయం గురించి అల్లు అరవింద్‌కు ఆల్రెడీ మెసేజ్ వెళ్లినట్టు తెలుస్తోంది. ఒకవేళ బాలయ్య స్పందించి క్షమాపణ చెప్తే షూటింగ్ జరుగుతుంది. లేదంటే అంతే సంగతి అన్నట్టు టాక్ వినిపిస్తోంది.