Sadhvi Niranjan : కేసీయార్ ఇంకెంత దోచుకుంటావ్: కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి సంచలన ప్రశ్న.!

NQ Staff - September 22, 2022 / 10:54 PM IST

Sadhvi Niranjan : కేసీయార్ ఇంకెంత దోచుకుంటావ్: కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి సంచలన ప్రశ్న.!

Sadhvi Niranjan : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై నిప్పులు చెరిగారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సందర్భంగా సాధ్వి నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Union Minister Sadhvi Niranjan Jyoti's sensational question to KCR

Union Minister Sadhvi Niranjan Jyoti’s sensational question to KCR

‘2014కి ముందు తెలంగాణలో తీవ్రవాద దాడులు జరిగాయి. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక తీవ్రవాదం జాడలే లేకుండా పోయాయ్..’ అని సాధ్వి నిరంజన్ జ్యోతి చెప్పుకొచ్చారు. ‘పదేళ్ళ ముందు భారీ హిందూ సమ్మేళ్ళనం జరిగితే వచ్చాను.. అప్పటినుంచి ఇప్పటివరకు రాష్ట్రం అనుకున్నంత అభివృద్ధి సాధించలేదు’ అని అన్నారామె.

కేంద్రం అందించే రేషన్‌ని అడ్డుకున్న కేసీయార్ ప్రభుత్వం..

పేదలకు కేంద్రం అందించే రేషన్‌ని కేసీయార్ ప్రభుత్వం అడ్డుకుంటోందనీ, ఆ డబ్బులన్నిటినీ కేసీయార్ దోచేస్తున్నారనీ ఆరోపించిన సాధ్వీ, ‘కేసీయార్, ఇంకెంత దోచుకుంటావ్.? ఇంకెంత తింటావ్.? ప్రభుత్వం వున్నది నీ కుటుంబం బాగు కోసమేనా.?’ అని ప్రశ్నించారు.

‘గ్రామ పంచాయితీలకు డబ్బులు వెళ్ళకుండా అడ్డుకుంటున్నారు.. వాటిని సైతం కేసీయార్ కుటుంబం దోచుకుంటోంది..’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి. కాగా, ఈ వేదికపై సాధ్వీ నిరంజన్ జ్యోతిని బండి సంజయ్ సన్మానించారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us