Anil RaviPudi : అనీల్ రావిపూడి.. మాములోడు కాదు, భార్య స్నేహితురాలికే లైటింగ్ కొట్టాడుగా..!

NQ Staff - May 26, 2022 / 01:24 PM IST

Anil RaviPudi : అనీల్ రావిపూడి.. మాములోడు కాదు, భార్య స్నేహితురాలికే లైటింగ్ కొట్టాడుగా..!

Anil RaviPudi : ప్ర‌స్తుతం టాలీవుడ్ మోస్ట్ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్స్‌లో అనీల్ రావిపూడి ఒక‌రు. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న తీసిన ప్ర‌తి సినిమా కూడా మంచి విజ‌యం సాధించింది. రేపు ఎఫ్ 3 చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నుండ‌గా, గ‌త కొద్ది రోజులుగా ఈ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. ఆ క్ర‌మంలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు కూడా తెలియ‌జేస్తున్నారు.

రీసెంట్‌గా అనీల్ రావిపూడి తన కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నాడు. అంతే కాకుండా త‌న‌ భార్య క్లాస్మేట్‌ని, అప్పట్లో తనకు తెలిసిన ఒక అమ్మాయిని కూడా రెగ్యులర్ గా చూసే వాడిని అని సరదాగా తెలియజేశాడు.ఇంజనీరింగ్ పూర్తి చేసిన అనీల్ రావిపూడి కాలేజీ రోజుల్లోనే చాలా సరదాగా స్టేజ్ షోలతో కూడా అలరించే వాడట. ఫ్రెండ్స్‌ తో కలిస్తే ఆ సరదా చాలా విభిన్నంగా ఉండేది అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు.

అయితే తన భార్యతో ప్రతిరోజు ఒక విషయంపై చిన్నపాటి సరదా గొడవ జరుగుతుంది అని అనీల్ తెలియజేశాడు. కాలేజ్ డేస్ లో ప్రతి రోజు నేను మరొక ఇద్దరు స్నేహితులం కలిసి నలుగురు అమ్మాయిలు ఉన్న ఒక బ్యాచ్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళం అంటూ.. అందులో ఒక అమ్మాయిని నేను ఎక్కువగా చూస్తూ ఉండేవాడిని అన్నాడు.

Twist in Anil RaviPudi Love Story

Twist in Anil RaviPudi Love Story

ఒక విధంగా ఆమెకు సైట్ కొట్టేవాడిని .. కట్ చేస్తే కొన్నేళ్ల తర్వాత ఆ బ్యాచ్ లోనే మరో అమ్మాయితో నాకు వివాహం జరగడం విశేషమని అనీల్ వివరణ ఇచ్చారు. ఈ విషయంలో నా భార్య అప్పుడప్పుడు కొంత దెప్పి పొడుస్తుంది అని కూడా ఈ దర్శకుడు చెప్పాడు. ఎఫ్ 2 సినిమాలో కొన్ని సన్నివేశాలు కూడా తన రియల్ లైఫ్ లోనివి అంటూ.. ఇప్పుడు మాత్రం F3 సినిమాలో ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే డబ్బు ఫ్రస్ట్రేషన్ చూపించబోతున్న ట్లుగా అనీల్ తెలియజేశాడు.

ఎఫ్ 3 చిత్రం 2019లో విడుదలైన F2 కు కొనసాగింపుగా వ‌స్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, బొమన్ ఇరానీ, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. స్పెష‌ల్ సాంగ్‌లో పూజా హెగ్డే సంద‌డి చేయ‌నుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us