Talasani Srinivas : సినిమా టిక్కెట్ ధ‌ర‌ల‌పై ఏపీ మంత్రుల‌తో మాట్లాడ‌తానన్న త‌ల‌సాని

Talasani Srinivas : గ‌త కొద్ది రోజులుగా ఏపీ సినిమా టిక్కెట్ వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సినీ పెద్ద‌లు స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించేందుకు ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇటీవ‌ల సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ అమ‌రావ‌తిలో పేర్ని నానిని క‌లిసి ప‌లు విష‌యాలపై చ‌ర్చించారు. అయితే వ‌ర్మ కూడా ప్ర‌భుత్వం స్పంద‌న‌పై పాజిటివ్‌గా ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదు.

TS Minister Talasani Srinivas Yadav going to talk about tickets rates with ap government
TS Minister Talasani Srinivas Yadav going to talk about tickets rates with ap government

అయితే తాజాగా ఈ స‌మ‌స్య గురించి తల‌సాని ..ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో ముచ్చ‌టించేందుకు సిద్ధ‌మైన‌ట్టు స‌మాచారం. తెలంగాణ‌లోని సినిమా థియేట‌ర్స్‌పై ఎలాంటి ఆంక్ష‌లు ఉండ‌వు. సినీ ప‌రిశ్ర‌మ‌కు ప్రభుత్వం ఎప్పుడు అండ‌గా ఉంటుంది. అందుకే ప్ర‌తి సమ‌స్య‌పై వెంట‌నే స్పందిస్తుంది.

సినీ ప‌రిశ్ర‌మ‌కు హైద‌రాబాద్ హ‌బ్‌గా ఉండాల‌నేది కేసీఆర్ ఆంకాక్ష‌. అందుకే ఐదో ఆట‌కు అనుమ‌తి ఇచ్చారు. అలానే టిక్కెట్ రేట్లు కూడా పెంచారు. సినీ ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌పై ఆ రాష్ట్ర మంత్రుల‌తో మాట్లాడ‌తాను. సినీ ప‌రిశ్ర‌మ‌పై మా ప్ర‌భుత్వం బ‌లవంతంగా నిర్ణ‌యాలు తీసుకోదు అంటూ త‌ల‌సాని మాట్లాడారు.

సినిమా టికెట్ ధరలను పెంచాలని ఎగ్జిబిటర్లు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.సినిమా టికెట్ ధరలతో పాటు థియేటర్ల వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన 13 మంది సభ్యుల కమిటీ మంగళవారం నాడు ఏపీ సచివాలయంలో భేటీ అయింది. ఏపీ రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ విశ్వజిత్ అధ్యక్షతన సమావేశం జరిగింది. సినిమా రేట్ల తగ్గింపుతో సినిమా థియేట‌ర్ యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయని ఎగ్జిబిటర్ వేమూరి బలరాం చెప్పారు.

ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన నిబంధనల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 200 సినిమా థియేటర్లు మూతబడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సినిమా థియేటర్లలో నిబంధనలను అమలు చేసే విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరారు.