Manchu Vishnu : మంచు విష్ణుపై దారుణ‌మైన ట్రోలింగ్.. ఎందుకో తెలుసా?

Manchu Vishnu : ఏపీలో సినిమా టిక్కెట్ వ్య‌వ‌హారం ఎంత పెద్ద హాట్ టాపిక్ అయిందో మ‌నందరం చూశాం. ఈ వివాదానికి సంబంధించి ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు స్పందిస్తూ త‌మ నిర్ణ‌యాలు తెలలియ‌జేశారు. రీసెంట్‌గా చిరంజీవి డైరెక్ట్‌గా జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి అస‌లు విష‌యాన్ని క్లియ‌ర్‌గా వివ‌రించారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు అయిన మంచు విష్ణు మాత్రం ఇప్పటి వరకు టికెట్ల విషయంలో కనీసం నోరు తెరచి మాట్లాడింది లేదు.

trolls on Manchu Vishnu in social media
trolls on Manchu Vishnu in social media

టొక్కెట్ల రేటు విషయమై ఎప్పుడూ ఇండస్ట్రీ గురించి పట్టనట్లు వ్యవహరించే రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించాడు. చిరంజీవి సుదీర్ఘంగా ముఖ్య‌మంత్రితో చర్చించిన త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.కానీ విష్ణు మాత్రం ఇప్పటికీ మౌనంగానే ఉన్నాడు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో మంచు విష్ణు కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒకరకంగా చూస్తే ఇద్దరు బంధువులు కూడా.

ఎన్నో విషయాల్లో జగన్ మోహన్ రెడ్డిని కలిసిన మంచు విష్ణు ఈ విషయంలో మాత్రం ఎందుకు కలిసి సినిమా పరిశ్రమ సమస్య ను గురించి తెలియ జేయడం లేదు అని సినీ వర్గాల వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సీఎం ను మా అధ్యక్షుడు కనీస బాధ్యత తో కలవడం లేదంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో మోహన్ బాబు ఒక లేఖను రాసి చేతులు దులిపేసుకున్నారు.

ఇండస్ట్రీ అందరం కలిసి ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేద్దాం. అన్నట్లుగా మోహన్ బాబు ఆ లేఖలో పేర్కొన్నారు. మంచు ఫ్యామిలీ మొత్తం తాము ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ విషయంలో మాత్రం పెద్దగా స్పందిస్తూ ఉన్న దాఖలాలు లేవు అంటున్నారు.ఈ నేపథ్యంలో మంచు విష్ణుని ఇంకా వారి ఫ్యామిలీని నెటిజన్స్ ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు.