Trisha : మళ్లీ ప్రేమలో విఫలం అయిన త్రిష.. వక్ర బుద్ధి అంటూ అంతలా ఫైర్ అయిందేంటి?
NQ Staff - August 21, 2022 / 04:24 PM IST

Trisha : చెన్నై చంద్రం త్రిష ఒకప్పుడు టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలుగులో సినిమాలు చేయకపోయిన తమిళంలో మాత్రం అడపాదడపా చేస్తూనే ఉంది. మరోవైపు పలు విషయాలతో హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు లో కూడా ఆమె స్టార్ హీరోయిన్ గా దాదాపుగా అగ్ర హీరోలందరితోను సినిమాలు చేశారు.

Trisha who failed in love again
మళ్లీ విఫలమా?
త్రిష ఎలాంటి సినిమా చేసిన కూడా ప్రేక్షకుల నుంచి మంచి క్రేజ్ అందుకున్న త్రిష కొన్నాళ్లకు మిగతా హీరోయిన్స్ నుంచి పోటీ తీవ్రత ఎక్కువ కావడంతో అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. అయితే నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్న కూడా ఇంకా పాతికేళ్ళ అమ్మాయి తరహా లోనే తన అందంతో ఎంతగానో ఆకట్టుకుంటుంది.
రెండు దశాబ్దాలుగా కథానాయకగా రాణిస్తున్న బహుభాషా నటి బ్యూటీ. తమిళం, తెలుగు, కన్నడం తదితర భాషల్లో దాదాపు అగ్ర నటులందరితోనూ నటించింది. లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. అప్పట్లో ఒక టాలీవుడ్ నటుడితో ప్రేమ వ్యవహారం నడిపిన ఈ అమ్మడు ఆ తర్వాత వరుణ్ మణియన్ అనే సినీ నిర్మాత, వ్యాపారవేత్తతో ప్రేమ, నిశ్చితార్థం వరకు వచ్చింది. కానీ పెళ్లి పీటలు ఎక్కలేదు. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి అనే అంశాలను పక్కనపెట్టి నటనపైనే దృష్టి సారించింది. అలాంటిది మళ్లీ ఇప్పుడు వార్తల్లోకెక్కింది.
ఈ సంచలన నటి ఇటీవల తన ఇంస్ట్రాగామ్‌లో పోస్ట్ చేసిన ఒక విషయం సంచలనంగా మారింది. ‘వక్ర బుద్ధి కలిగిన నీలాంటి వాడితో మాట్లాడకుండటమే ఉత్తమం’అని పేర్కొంది. దీంతో అలా పేర్కొనడానికి కారణం ఏమిటి? ఎవరిని అంతగా ద్వేషిస్తోంది. ప్రేమలో మూడోసారి ఫెయిల్ అయ్యిందా? వంటి విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.