Trisha Krishnan : కాంగ్రెస్ పార్టీలోకి సినీ నటి త్రిష.! నిజమేంటంటే.!
NQ Staff - December 26, 2022 / 01:54 PM IST

Trisha Krishnan : ప్రముఖ సినీ నటి త్రిష రాజకీయాల్లోకి రాబోతోందంటూ పెద్దయెత్తున ప్రచారం జరుగుతోంది. తమిళ, తెలుగు సినిమా పరిశ్రమల్లో ఒకప్పుడు త్రిష టాప్ హీరోయిన్. ఆ తర్వాత అనూహ్యంగా ఆమె క్రేజ్ తగ్గింది. ఇటీవల ‘పొన్నియన్ సెల్వన్-1’లో నటించిన త్రిష మళ్ళీ తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో హాట్ టాపిక్ అయ్యింది.
ఇంతకీ, త్రిష రాజకీయాల్లోకి వస్తుందా.? రాదా.? త్రిష రాజకీయాల్లోకి వస్తుందంటూ ఎందుకు ప్రచారం జరుగుతోంది.? కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరనుందన్న ప్రచారంలో నిజమెంత.?
త్రిష ఏం చెప్పిందంటే..
తన తాజా చిత్రం ‘రాంగీ( ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకొచ్చిన త్రిషకి, రాజకీయ రంగ ప్రవేశంపై మీడియా నుంచి ప్రశ్నలు పోటెత్తాయి.
ఈ ప్రశ్నలపై త్రిష ఒకింత అసహనం వ్యక్తం చేసింది. తాను రాజకీయాల్లోకి రావడంలేదని చెప్పింది. ఏ పార్టీలోనూ చేరడంలేదనీ, తాను ప్రస్తుతం సినిమాల్లో బిజీగా వున్నాననీ త్రిష స్పష్టతనిచ్చేసింది.
తమిళ సినీ పరిశ్రమలో నటీనటులకు రాజకీయాలు కొత్త కాదు. నగ్మా తదితరులు ఇప్పటికే రాజకీయాల్లో వున్నారు. త్రిష మాత్రం రాజకీయాలు తనకు సరిపడవని అంటోంది.