Trisha Krishnan : ‘ఆచార్య’పై త్రిష అలా సెటైర్లు వేసిందా.? నిజమెంత.!

NQ Staff - September 19, 2022 / 09:42 PM IST

Trisha Krishnan : ‘ఆచార్య’పై త్రిష అలా సెటైర్లు వేసిందా.? నిజమెంత.!

Trisha Krishnan : హీరోయిన్ త్రిష ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా పార్ట్ వన్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. చాలామంది ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. అందులో త్రిష కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోంది.

ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వమ్’ ప్రమోషన్లలో త్రిష బిజీగా వుంది. తమిళనాడులో ఈ సినిమాని బీభత్సంగా ప్రమోట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాని విడదుల చేస్తున్నా, ప్రమోషన్లైతే తమిళనాడుకే పరిమితం చేశారు ప్రస్తుతానికి.

‘ఆచార్య’ సినిమాపై త్రిష సెటైర్లేసిందా.?

Trisha Krishnan Comments On Acharya Movie

Trisha Krishnan Comments On Acharya Movie

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమాలో తొలుత త్రిష నటించాల్సి వుంది. చిరంజీవికి జోడీగా త్రిషని అనుకున్నారు. ఆమె పేరు ఖరారయ్యింది కూడా. చివరి నిమిషంలో త్రిషని తీసేసి, కాజల్‌ని పెట్టుకున్నారు. కాజల్‌తో కొన్ని సీన్స్ షూట్ చేశారుగానీ, సినిమాలోంచి ఆమెని పూర్తిగా తొలగించేశారు.

ఈ వ్యవహారంపై త్రిష తాజాగా స్పందించిందట.. అదీ పరోక్షంగా. ‘సినీ రంగంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా.. కొన్ని సినిమాల్లో నటించి వుండకపోవడమే మంచిదనిపిస్తుంది. ఇటీవల అలాంటి అనుభవాన్ని చవిచూశా. పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించే అవకాశాన్ని కాదనుకుంటే పెద్ద తప్పు చేసినట్లు..’ అని త్రిష వ్యాఖ్యానించినట్లు తమిళ సినీ మీడియా కోడై కూస్తోంది.

ఎలాగూ ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ కోసం హైద్రాబాద్ వస్తుంది గనుక, త్రిష ముందర ‘ఆచార్య’ సినిమా సంబంధిత ప్రశ్నలొస్తాయ్. అప్పుడు త్రిష ఏమంటుందో వేచి చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us