Avatar 2 Trailer : ప్రపంచం ఎదురు చూస్తున్న సినిమా ట్రైలర్ ఎప్పుడంటే..!

NQ Staff - October 30, 2022 / 04:16 PM IST

Avatar 2 Trailer : ప్రపంచం ఎదురు చూస్తున్న సినిమా ట్రైలర్ ఎప్పుడంటే..!

Avatar 2 Trailer  : ఒక సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురు చూడడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కొన్ని సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూడడం మనం చూస్తూ ఉంటాం.

జేమ్స్ బాండ్ తరహా సినిమాల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యాక్షన్ సినీ ప్రేమికులు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అవతార్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

13 సంవత్సరాల క్రితం వచ్చిన అవతార్ సినిమా ను ఇంకా కూడా జనాలు మర్చి పోలేదు. ఆ స్థాయిలోనే అవతార్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డిసెంబర్ లో విడుదల కాబోతున్న అవతార్ 2 సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే.

ఆ స్థాయిలోనే సినిమా ఉంటుందని నమ్మకాన్ని జేమ్స్ కామరూన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇక ఈ సినిమా యొక్క ట్రైలర్ కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా అందుతున్న అంతర్జాతీయ మీడియా సమాచారం అనుసారం నవంబర్ మొదటి వారంలో లేదా నవంబర్ రెండవ తారీఖున ప్రేక్షకుల ముందుకు అవతార్ 2 ట్రైలర్ ని తీసుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ట్రైలర్ విడుదల తర్వాత సినిమా స్థాయి అమాంతం పెరిగే అవకాశం ఉంది. వందల కోట్ల వసూళ్లను ఈ సినిమా రాబట్టడం ఖాయం అంటూ బాక్సాఫీస్ వరకు మాట్లాడుకుంటున్నారు.

కేవలం తెలుగు వర్షన్ 100 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే 250 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని తెలుగు వర్షన్ అవతార్ 2 నమోదు చేసే అవకాశం ఉంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us