Prabhas 25th Movie: ప్ర‌భాస్ 25వ సినిమాపై క్రేజీ అప్‌డేట్‌.. రేపు ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Prabhas 25th Movie: యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల రాధే శ్యామ్ చిత్ర షూటింగ్ పూర్తి చేయ‌గా,ఈ చిత్రానికి సంక్రాంతికి విడుద‌ల చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం స‌లార్, ఆదిపురుష్ చిత్రాలు చేస్తున్నారు. నవంబ‌ర్ లో ప్రాజెక్ట్ కె చిత్ర షూటింగ్ మొద‌లు పెట్ట‌నున్నాడు.

త్వరలోనే తన ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాపై కూడా అఫీషియల్ గా క్లారిటీ వ‌స్తుంద‌ని కొన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎట్ట‌క‌లేకు టీ సిరీస్ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా అక్టోబర్ 7 పెద్ద న్యూస్ రాబోతుంద‌ని ప్ర‌క‌టించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అది సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్నట్టు సమాచారం. టీ సిరీస్ నిర్మించ‌నుంది. ఇందులో ఇదివరకెప్పుడూ కనిపించని ఓ కొత్త రకమైన పాత్రలో ప్రభాస్‌ కనిపించనున్నారట.

పరిస్థితులు అనుకూలిస్తే ప్రభాస్ వచ్చే ఏడాది ఈ మూడు సినిమాలను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ను ఇటీవల సెట్స్ పైకి తీసుకువచ్చారు. ఆ సినిమాను కూడా ప్రభాస్ వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకున్నాడు. ప్రభాస్ ఒకేసారి గ్యాప్ లేకుండా మూడు సినిమాలతో బిజీ కాబోతున్నాడు.

ప్ర‌భాస్ 25వ సినిమా ఇప్పటి వరకు వచ్చిన సినిమాల కంటే అత్యధిక బడ్జెట్ తోనే రూపొందించే అవకాశం ఉందని తెలుస్తోంది. సినిమాకు దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్ ను కేటాయించే అవకాశం ఉందట. ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమా కూడా అంతటి భారీ బడ్జెట్ తో తెరపైకి వచ్చింది లేదు. మరో రెండు ప్రాజెక్టులు..? మరోవైపు ప్రభాస్ మరో రెండు ప్రాజెక్టుల విషయంలో కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోయే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. కాగా, డార్లింగ్ బాలీవుడ్ సినిమా దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.