Tollywood : టాలీవుడ్‌లో టిక్కెట్ల గోల.! తెగే పంచాయితీ కాదిది.!
NQ Staff - July 26, 2022 / 08:44 AM IST

Tollywood : సినిమాలో కంటెంట్ వుంటే, ఐదొందల రూపాయలు పెట్టి అయినా టిక్కెట్ కొనుక్కుని సినిమా చూస్తారు సినీ అభిమానులు. అదే, సినిమాలో కంటెంట్ చప్పగా వుంటే, పది రూపాయలు ఖర్చు చేయడానికి కూడా సగటు సినీ ప్రేక్షకుడు ఇష్టపడడు. ఇది సినిమాకి సంబంధించి ప్రాథమిక సూత్రం అయి కూర్చుంది.

Tollywood movis tickets rates issue
ఒకప్పుడు సినిమా మాత్రమే సామాన్యుడికి వినోదం పంచి ఇచ్చేది. ఇప్పుడలా కాదు. న్యూస్ ఛానళ్ళలో రాజకీయ నాయకులు ఇచ్చే ఎంటర్టైన్మెంట్, క్రికెట్ సహా ఇతరత్రా వినోదం, దాంతోపాటుగా ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఓటీటీ.. వెరసి, సామాన్యుడు వినోదం కోసం థియేటర్ వరకూ వెళ్ళాలంటే అది అంత తేలిక కాదు.
టిక్కెట్లే పెద్ద సమస్య కాదు..
సినిమా టిక్కెట్ల ధరల అంశం నిర్మాతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తక్కువ ధరలతోనూ నష్టమే, ఎక్కువ ధరలతోనూ నష్టమే. మరెలా సినిమాలు తీసేది.? విడుదల చేసేది.? ఇదే ఇప్పుడు సినీ పరిశ్రమలో చాలామందిని వేధిస్తోన్న అంశం.
చర్చలు జరుగుతూనే వున్నాయ్.. ఇలాగైతే సినిమాలు నిర్మించలేం.. కొన్నాళ్ళు ఆపేద్దాం.. అన్న చర్చ జరుగుతోందట. కానీ, అలాంటి సీరియస్ డెసిషన్ తీసుకునే అవకాశమే లేదు. అయినాగానీ, తప్పేలా లేదంటున్నారు కొందరు సినీ జనాలు.
ఏమో, ఏం జరుగుతుందోగానీ.. మొత్తం వ్యవహారం టిక్కెట్ల చుట్టూనే జరగడం వల్ల, సినిమా పరిశ్రమ ఎదుర్కొంటోన్న ‘క్వాలిటీ కంటెంట్’ అంశం తెరమరుగవుతోంది.