Tollywood Directors Are Making Block Buster Hit Movies : టాలీవుడ్ లో రాజమౌళిలా ప్లాపులు లేని దర్శకులు ఎవరో తెలుసా..?

NQ Staff - July 9, 2023 / 10:11 AM IST

Tollywood Directors Are Making Block Buster Hit Movies : టాలీవుడ్ లో రాజమౌళిలా ప్లాపులు లేని దర్శకులు ఎవరో తెలుసా..?

Tollywood Directors Are Making Block Buster Hit Movies :

సినిమా ఇండస్ట్రీలో దర్శకుల మీద ఎంత ప్రెషర్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఒక సినిమా ప్లాప్ అయితే ఆ దర్శకుడినే బాధ్యుడిని చేస్తారు. ఒకవేళ హిట్ అయితే ఆ క్రెడిట్ అందరికీ వెళ్తుంది. అదే ఇక్కడ వ్యత్యాసం. అందుకే డైరెక్టర్లు ఎలాగైనా హిట్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో అపజయం అంటూ ఎరగని దర్శకుడు అంటే అందరికీ రాజమౌళినే గుర్తుకొస్తాడు.

ఎందుకంటే ఇప్పటి వరకు రాజమౌళి తీసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ ను బద్దలు కొట్టేశాయి. తీసిన ప్రతి సినిమాతో తన రికార్డులను తానే బ్రేక్ చేస్తూ ఉంటాడు ఈయన. అందుకే రాజమౌళి సినిమాలకు అంతటి క్రేజ్ ఉంటుంది. ఇక రాజమౌళి తర్వాత హిట్ తప్ప ప్లాప్ లు లేని దర్శకుడు ఇద్దరు ఉన్నారు.

అనిల్ రావిపూడి కూడా..

అందులో ఒకరు అనిల్ రావిపూడి. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. పైగా అన్నింటిలో ఆయన మార్క్ కామెడీ అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం బాలయ్యతో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత ఆయన ఎఫ్‌-4 సినిమా తీసే ఛాన్స్ కూడా ఉంది.

Tollywood Directors Are Making Block Buster Hit Movies

Tollywood Directors Are Making Block Buster Hit Movies

ఇక నాగ్ అశ్విన్ కూడా ఎలాంటి ప్లాపులు లేకుండా సినిమాలు తీస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు రెండు హిట్ అయ్యాయి. ఎవడే సుబ్రహ్మణ్యంతో తన తొలి హిట్ అందుకున్నాడు. అదే ఆయనకు మొదటి సినిమా. దాని తర్వాత వచ్చిన మహానటి కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తున్నాడు. ఇది భారీ బడ్జెట్ తో తీస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us