Tollywood : టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ ఫస్టాఫ్‌ రిపోర్ట్.. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం

NQ Staff - June 28, 2022 / 10:12 AM IST

Tollywood : టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ ఫస్టాఫ్‌ రిపోర్ట్.. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం

Tollywood : కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్ టాలీవుడ్‌ పై గట్టిగానే పడింది. మేకింగ్, పోస్ట్‌ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న సినిమాలతో పాటు రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలు కూడా చాలా ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేశాయి. మొత్తానికి హండ్రెడ్ పర్సెంట్‌ ఆక్యుపెన్సీతో థియేటర్లు గతంలో లాగా నడుస్తుండడంతో సినిమాల్ని వరుసగా రిలీజ్ చేసేసి ఆడియెన్స్‌ ని అలరించాలనుకున్నారు మేకర్స్‌. ఈ ప్రాసెస్‌ లో కొన్ని మూవీస్‌ సక్సెస్‌ అయితే, మరికొన్ని ఫ్లాప్‌ టాక్‌ మూటగట్టుకున్నాయి. ఇంకొన్ని సోసో గా నిలిచి సేఫ్‌ జోన్‌ లోకొచ్చాయి. ఓవరాల్ గా మరి ఈ ఏడాది బాక్సాఫీస్‌ ఫస్టాఫ్ రిజల్ట్ ఏంటనేది ఓసారి చూసేద్దాం.

కొన్ని మూవీస్‌ సక్సెస్‌ అయితే, మరికొన్ని ఫ్లాప్‌ టాక్‌…..

Tollywood Box Office‌ Fastoff Result Movies

Tollywood Box Office‌ Fastoff Result Movies

నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన బంగార్రాజు మూవీ జనవరి పద్నాలుగున సంక్రాంతి బాక్సాఫీస్‌ బరిలో నిలిచింది. సోగ్గాడే చిన్ని నాయనకు స్టోరీ లింకప్‌ ఉండడం, ఆ మూవీ హిట్ అవడంతో డైరెక్టర్‌ కళ్యాణ్‌ క్రిష్ణ కురసాల మ్యాజిక్‌ మరోసారి పనిచేసింది. ఫలితంగా లవ్ స్టోరీ తర్వాత చైతూకి మరో హిట్ దక్కితే, ఉప్పెన, శ్యామ్‌ సింగరాయ్‌ తో పాటు కెరీర్ లో మరో సక్సెస్ ను అందుకుంది కృతి.

Tollywood Box Office‌ Fastoff Result Movies

Tollywood Box Office‌ Fastoff Result Movies

ఇక ఫిబ్రవరి పన్నెండున డీజే టిల్లుతో సిద్ధు జొన్నలగడ్డ బాక్సాఫీస్‌ దగ్గర రీసౌండ్ ఒచ్చే హిట్ ఇచ్చాడు. మా వింత గాథ వినుమా, క్రిష్ణ అండ్‌ హిజ్‌ లీల వంటి చిత్రాలతో ఓటీటీ హిట్స్ ఒచ్చినా, సిల్వర్‌ స్క్రీన్‌ పై ఫస్ట్‌ బిగ్గెస్ట్‌ హిట్ సంపాదించి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ నీ పెంచుకున్నాడు టిల్లు.

Tollywood Box Office‌ Fastoff Result Movies

Tollywood Box Office‌ Fastoff Result Movies

గతేడాది వకీల్ సాబ్ తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ ఈ ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్‌ తో మనల్నెవడ్రా ఆపేది అని సక్సెస్‌ జర్నీని కంటిన్యూ చేశాడు. ఓపెనింగ్స్ నుంచీ ఓ రేంజ్ వసూళ్లనందుకుని రీమేక్స్‌ తో తనకున్న సెంటిమెంట్‌ ను మరోసారి నిజం చేసుకున్నాడు.

Tollywood Box Office‌ Fastoff Result Movies

Tollywood Box Office‌ Fastoff Result Movies

ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా నటించిన రాధే శ్యామ్‌ మార్చి పదకొండున విడుదలైంది పామిస్ట్‌ క్యారెక్టర్లో ప్రభాస్‌ ఎన్ని జాతకాలు చెప్పినా తన జాతకంలో ఈ ప్రాజెక్ట్‌ తేడా కొడుతుందని తెలుసుకోలేకపోయాడు. భారీ గ్రాఫిక్స్‌, అద్భుతమైన ప్రేమ కథ అంటూ ఎన్ని ఎలివేషన్స్‌ ఇచ్చినా రిజల్ట్ ని ఇంపాక్ట్‌ చేయలేకపోయాయి. ఫలితంగా ఫ్లాప్‌ గానే మిగిలిపోయి కామ్ అయింది రాధేశ్యామ్‌.

Tollywood Box Office‌ Fastoff Result Movies

Tollywood Box Office‌ Fastoff Result Movies

ఇక యావత్ దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ RRR మార్చి 25 ఐదున విడుదలై ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వెయ్యికోట్ల మార్క్‌ ను దాటి జక్కన్న సత్తా ఏంటో సారా దున్యాకు మరోసారి చాటింది. ఓరకంగా కరోనా తర్వాత థియేటర్స్ కి దూరమైన కామన్‌ ఆడియెన్స్‌ ని బాక్సాఫీస్‌ వరకూ రప్పించి రాబోయే సినిమాలకు కూడా ధైర్యాన్నిచ్చింది.

Tollywood Box Office‌ Fastoff Result Movies

Tollywood Box Office‌ Fastoff Result Movies

విజయ్ నటించిన తమిళ్‌ డబ్బింగ్‌ మూవీ బీస్ట్ ఏప్రిల్ పదమూడున ఎంట్రీ ఇచ్చింది. కానీ డైరెక్టర్‌ నెల్సన్ తన మార్క్‌ ను నిలబెట్టు కోకపోవడమే కాక ఫ్యాన్స్‌ పరువునూ నిలబెట్టలేకపోయాడు. దాంతో ఏ భాషలోనూ మోస్తరు హిట్ గా నిలవలేక చతికిలపడింది బీస్ట్.

Tollywood Box Office‌ Fastoff Result Movies

Tollywood Box Office‌ Fastoff Result Movies

ఇక కేజీఎఫ్ వన్ తో రాకీ భాయ్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో చెప్పక్కర్లేదు. చాప్టర్ టూలో భారీ స్టార్‌ కాస్టింగ్ ఉండడం, టీజర్ అండ్ ట్రైలర్ తోనూ ఆడియెన్స్‌ లో హైప్ పెంచడంతో ఎప్పుడు రిలీజవుతుందా అని ప్రేక్షకులు కూడా ఈగర్ గా వెయిట్ చేశారు. మొత్తానికి ఏప్రిల్ పద్నాలుగున విడుదలై నేషనల్ వైడ్‌ గా యునానిమస్‌ హిట్ టాక్‌ ను మూటగట్టుకుంది. ప్రశాంత్ నీల్ తో పాటు టోటల్ కాస్ట్ అండ్ క్రూ, టెక్నీషియన్స్‌ కి కూడా మంచి అప్లాజ్‌ దక్కింది.

Tollywood Box Office‌ Fastoff Result Movies

Tollywood Box Office‌ Fastoff Result Movies

మెగా స్టార్, మెగా పవర్‌ స్టార్‌ కలిసి నటించిన ఆచార్య ఏప్రిల్ 29న అభిమానుల ముందుకొచ్చింది. కెరీర్ లో ఫ్లాపంటూ లేని కొరటాల డైరెక్ట్‌ చేయడంతో ఈ సినిమాపై బడ్జెట్‌ కు తగ్గట్టుగానే అంచనాలేర్పడ్డాయి. కానీ రిలీజ్‌ తర్వాత ఫలితం మాత్రం పాదఘట్టంలో పాతరెట్టినయిపోయింది.

Tollywood Box Office‌ Fastoff Result Movies

Tollywood Box Office‌ Fastoff Result Movies

మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన స్టయిల్ ను పూర్తిగా మార్చుకుని క్లాస్ క్యారెక్టర్ లో అర్జున్ కుమార్ అల్లంగా తన పెళ్లిగోలను చెప్పేందుకు
మే ఆరున అశోక వనంలో అర్జున కళ్యాణం అంటూ టాకీసుల్లోకి దిగాడు. ఓ ఫీల్ గుడ్ మూవీగా, సింపుల్ బట్ బ్యూటిఫుల్ సినిమాగా ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించారీ సినిమాను.

Tollywood Box Office‌ Fastoff Result Movies

Tollywood Box Office‌ Fastoff Result Movies

మహేష్‌ బాబు, కీర్తి సురేష్‌ జంటగా నటించిన సర్కారు వారి పాట మే పన్నెండున ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరో పోకిరి అవుతుందేమో అనుకున్న ఫ్యాన్స్‌ అంచనాలకి అటు ఇటుగా ఓ మోస్తరు హిట్ గా నిలిచింది సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాస్ బస్టర్‌ తర్వాత ఆ రేంజ్ సక్సెస్‌ వస్తుందని ఆశించినా అంతంత మాత్రంగానే ఆకట్టుకుంది.

Tollywood Box Office‌ Fastoff Result Movies

Tollywood Box Office‌ Fastoff Result Movies

మరోవైపు ఓ రోజు ఆగి డాన్ గా మే పదమూడున డబ్‌ మూవీతో బరిలోకి దిగాడు శివకార్తికేయన్‌. తన ఒక్కో సినిమాతో మెల్లిగా టాలీవుడ్‌ లోనూ మార్కెట్ ను పెంచుకుంటూ వస్తున్న ఈ యంగ్‌ హీరో ఈ ప్రాజెక్ట్ తోనూ తన సక్సెస్‌ హవాని కంటిన్యూ చేశాడు.ఓ రకంగా కోలీవుడ్‌ కి తీసిపోని తీరు టాలీవుడ్‌ లోనూ బాగా ఆడిందీ చిత్రం.

Tollywood Box Office‌ Fastoff Result Movies

Tollywood Box Office‌ Fastoff Result Movies

ఇక ఫన్‌ అండ్ ఫ్రస్టేషన్‌ ఫ్రాంచైజ్‌ అంటూ మే ఇరవై ఏడున ఎంటరైంది ఎఫ్‌ త్రీ. ఫ్యామిలీ ఆడియెన్స్‌ ఆదరిస్తారనీ, కామడీ లవర్స్‌ కడుపుబ్బేలా నవ్వుతారని ఆశించారు కానీ.. అనిల్ రావిపూడి కెరీర్ లో ఉన్న హిట్స్‌ కి, కలెక్షన్స్‌ కీ ఏ మాత్రం మ్యాచ్ చేయలేకపోయింది ఎఫ్ త్రీ. మరీ రిజల్ట్‌ చూశాక ఎఫ్ టూ ఫ్రాంచైజ్ ప్లాన్ ని ఏం చేస్తారనేది చూడాలి.

Tollywood Box Office‌ Fastoff Result Movies

Tollywood Box Office‌ Fastoff Result Movies

ట్రైలర్ తోనే నేషనల్ వైడ్ గా ఆడియెన్స్‌ అటెన్షన్ ని డ్రా చేసిన మేజర్ మూవీ జూన్ మూడున ప్రేక్షకుల ముందుకొచ్చి అందరితోనూ సెల్యూట్ చేయించుకుంది. సందీప్ ఉన్నిక్రిష్ణన్ పాత్రలో నటించిన అడివిశేషుకి ఇండియా వైడ్ గా అప్లాజ్ దక్కింది. క్రిటిక్స్ అప్రిషియేషన్స్ తో పాటు కలెక్షన్స్ కూడా సంపాదించుకుంది.

Tollywood Box Office‌ Fastoff Result Movies

Tollywood Box Office‌ Fastoff Result Movies

ఇక ఇదే జూన్ మూడున తమిళ్‌ డబ్బింగ్ మూవీ విక్రమ్ కూడా రిలీజై సౌత్ బాక్సాఫీస్ ను భారీగా షేక్ చేసింది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ బ్రిలియన్స్‌ కీ, కమల్‌ పర్‌ ఫామెన్స్‌ కి ప్రతీ ఆడియెన్ ఫిదా అయ్యాడు. దాదాపు దశాబ్ధ కాలంగా మినిమమ్ హిట్ కూడా లేని లోకనాయకుడికి సరికొత్త బూస్టప్‌ నిచ్చిందీ చిత్రం.

Tollywood Box Office‌ Fastoff Result Movies

Tollywood Box Office‌ Fastoff Result Movies

తన వరుస ఫ్లాపుల నుంచి బైటపడి మళ్లీ సక్సెస్‌ ట్రాక్ ఎక్కేందుకు అంటే సుందరానికి ప్రాజెక్ట్ ని గట్టిగా నమ్ముకున్నాడు న్యాచురల్ స్టార్ నాని.
వివేక్‌ ఆత్రేయ స్టోరీ టెల్లింగ్ ఏ మాత్రం కూడా డౌట్ లేకుండా సినిమా చేశాడు. నజ్రియా కూడా ఈసినిమాతో మాంచి కమ్‌ బ్యాక్ ఇద్దామని కలలు కంది. కానీ జూన్‌ పదిన గ్రాండ్‌ గా ఎంట్రీ ఇచ్చినా ఆడియెన్స్‌ సుందరం, లీలా లవ్ స్టోరీకి అంతలా కనెక్టవ్వలేకపోయారు. సింపుల్‌ స్టోరీని మూడు గంటలు చెప్పడంతో కాస్త డిజప్పాయింట్ అయ్యారు. దాంతో బాక్సాఫీస్‌ లో నిలవడం కష్టమని డిసైడయి త్వరలోనే ఓటీటీ బాటపట్టిందీ చిత్రం.

Tollywood Box Office‌ Fastoff Result Movies

Tollywood Box Office‌ Fastoff Result Movies

రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించిన విరాటపర్వం పదిహేడు జూన్ న ఆడియెన్స్‌ ముందుకొచ్చింది. కానీ స్టోరీ అన్నిరకాల ప్రేక్షకులకి కనెక్ట్‌ కాకపోవడంతో, ఎక్కడో మ్యాజిక్ మిస్సవడంతో సక్సెస్ టాక్ సంపాదించలేకపోయింది.

Tollywood Box Office‌ Fastoff Result Movies

Tollywood Box Office‌ Fastoff Result Movies

ఈ ఇయర్ ఫస్టాఫ్‌ ఆఖర్లో జూన్ ఇర్వై నాల్గున చిన్న చిత్రాలతో పాటు సమ్మతమే, చోర్ బజార్ కూడా బరిలోకి దిగాయి. ఈ రెండు కూడా యావరేజ్ టాక్ నే వెనకేసుకుని ముందుకెళ్లేందుకు కష్టపడుతున్నాయి.

Tollywood Box Office‌ Fastoff Result Movies

Tollywood Box Office‌ Fastoff Result Movies

ఇవే కాకుండా ఘని, ఆడవాళ్లు మీకు జోహార్లు, ఖిలాడీ.. ఇలా ఇంకొన్ని చిత్రాలు ఆడియెన్స్‌ సహనానికి పరీక్షలు పెట్టాయి. థియేటర్స్‌ లోకి ఎప్పుడు వచ్చాయో ఎప్పుడో వెళ్లాయో కూడా తెలీకుండా అవుటైపోయాయి. సో ఓవరాల్ గా కొంచెం ఇష్టం, కొంచెం కష్టం అన్నట్టుగా కొన్ని హిట్స్‌ తో, ఇంకొన్ని ఫ్లాపులతో, మధ్య మధ్యలో డిజాస్టర్లతో ఈ ఇయర్‌ ఫస్టాఫ్‌ సాగింది.

Tollywood Box Office‌ Fastoff Result Movies

Tollywood Box Office‌ Fastoff Result Movies

మరి సెకండాఫ్‌ లో ఏ ప్రాజెక్ట్‌ ఏ రేంజ్‌ హిట్ కొడుతుంది? కలెక్షన్స్‌ తో సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తుంది? ఇండస్ట్రీకి సరికొత్త జోష్‌ నిస్తుంది అనేది చూడాలిక.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us