TNR Family : క‌ర్ణ మూవీ లాంచ్ కార్య‌క్ర‌మంలో క‌న్నీరు పెట్టుకున్న టీఎన్ఆర్ కుటుంబ స‌భ్యులు

TNR Family : ప్రముఖ జర్నలిస్ట్‌, యాంకర్‌, నటుడు టీఎన్‌ఆర్‌(తుమ్మల నరసింహా రెడ్డి) గ‌త ఏడాది మేలో కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే. తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ ఎంతో పాపులర్‌ అయిన టీఎన్‌ఆర్‌ కరోనా రక్కసికి బలయ్యారు. మొదట హోం ఐసోలేషన్‌లో ఉన్న టీఎన్‌ఆర్‌ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.

TNR Family Gets Very EMOTIONAL On His Birthday and Karna Movie Launch
TNR Family Gets Very EMOTIONAL On His Birthday and Karna Movie Launch

అక్క‌డ చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించడంతో మరణించారు. ‘ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR’ అంటూ సూటిగా, సుత్తి లేకుండా ఇంటర్వ్యూలు చేసే టీఎన్‌ఆర్‌కు యూత్‌లోనూ మంచి క్రేజ్‌ ఉంది. టిఎన్ఆర్‌కు అనారోగ్యం అని తెలియగానే ఆయన కోలుకోవాలంటూ పలువురు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆయ‌న మృతితో సినిమా ప‌రిశ్ర‌మకి చెందిన ప్ర‌ముఖులు భాదోత‌ప్త హృద‌యంతో ట్వీట్స్ చేశారు.

‘ఫ్రాంక్లీ విత్‌ టీఎన్‌ఆర్‌’ అనే షోతో తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ టీఎన్‌ఆర్‌ ఎంతో గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. యూట్యూబ్‌ వేదికగా రామ్‌ గోపాల్‌ వర్మ, తేజ సహా ఎంతోమంది సినీ ప్రముఖులను తనదైన శైలిలో ఒక్కోసారి 4 గంటలపాటు సుధీర్ఘంగా ఇంటర్వ్యూ చేసిన ఘనత టీఎన్‌ఆర్‌దే.

1992లో దేవదాస్‌ కనకాల వద్ద దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్న టీఎన్‌ఆర్‌ ఆ తర్వాత ఓ స్నేహితుడి ద్వారా రచయిత, నటుడు ఎల్బీ శ్రీరామ్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. అలీ నటించిన పలు సినిమాలకు, చిరు నటించిన ‘హిట్లర్‌’ చిత్రానికి సైతం స్క్రిప్ట్‌లో పాలు పంచుకున్నారు. ఆ తర్వాత నటుడిగానూ తన ప్రస్థానం సాగించారు. ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘జార్జిరెడ్డి’, ‘సుబ్రహ్మణ్య పురం’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ వంటి చిత్రాల్లో నటించారు.

టీఎన్ ఆర్ మ‌ర‌ణంతో ఆయ‌న ఫ్యామిలీ నిద్ర లేని రాత్ర‌లు గడుపుతుంది. రీసెంట్ గా క‌ర్ణ మూవీ లాంచ్ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌గా, ఆ కార్యక్ర‌మానికి హాజ‌రైన టీఎన్ ఆర్ ఫ్యామిలీ శోక సంద్రంలో మునిగారు. ఇది చూసి నెటిజ‌న్స్ కూడా క‌న్నీరు పెట్టుకున్నారు.