Mahesh Babu : ‘అతడి ఖలేజా’.! మహేష్ – త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదే పెట్టేస్తారా.. ఏంటీ.!
NQ Staff - September 12, 2022 / 11:09 PM IST

Mahesh Babu : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలొచ్చాయి. ఇప్పుడు ముచ్చటగాడో మూడో సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ రోజే సినిమా షూటింగ్ ప్రారంభమయ్యింది.

This is the title of Mahesh Babu Trivikram movie
ఈ సినిమా గురించి పేర్కొంటూ, పీఆర్ టీమ్స్ ‘అతడి ఖలేజా’ అని చెబుతున్నాయ్. ‘అతడి ఖలేజా’.. వినడానికి బాగానే వుందే.! ఇదే టైటిల్ పెట్టేస్తే బావుణ్ణనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.
అతడు ప్లస్ ఖలేజా.. అంతేనా.?
నిజానికి ‘అతడు’ సినిమా సూపర్ డూపర్ హిట్ ఏమీ కాదు. ‘ఖలేజా’ సినిమా కూడా అంతే. రెండిటినీ కాస్ట్ ఫెయిల్యూర్స్‌గా చెబుతారు ట్రేడ్ పండితులు. కానీ, ఆ రెండు సినిమాలు ఎప్పుడు టీవీల్లో ప్లే అయినా, టీవీ స్క్రీన్లకు అతుక్కుపోతుంటాం.
యావరేజ్, ఎబౌ యావరేజ్ సినిమాల్లా మాత్రమే వాటిని కొంతమంది ట్రీట్ చేస్తారు. అలాంటప్పుడు, ‘అతడి ఖలేజా’ అని మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోయే కొత్త సినిమా గురించి ప్రస్తావించడం ఎంతవరకు సబబు.? అన్న చర్చ మహేష్ అభిమానుల్లోనే కలుగుతోంది.
అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా.! మహేష్ ఇమేజ్ కావొచ్చు.. త్రివిక్రమ్ పాపులారిటీ కావొచ్చు.. ఇవి వేరే లెవల్‌కి వెళ్ళాయ్. ఇప్పుడు స్టార్ హీరోల సినిమా అంటే పాన్ ఇండియా లెక్క.! సో, అతడి ఖలేజా.. అంటూ పాత ప్రస్తావన అనవసరం.