Jai Balayya Movie : బాలయ్య సినిమాకి మళ్ళీ కోవిడ్ కష్టాలొచ్చాయ్.!

NQ Staff - July 7, 2022 / 06:54 PM IST

Jai Balayya Movie : బాలయ్య సినిమాకి మళ్ళీ కోవిడ్ కష్టాలొచ్చాయ్.!

Jai Balayya Movie : బాలయ్య సినిమాని కోవిడ్ కష్టాలు వెంటాడుతున్నాయ్. మొన్నీ మధ్యనే బాలయ్యను కోవిడ్ ఎటాక్ చేసింది. కోవిడ్ పాజిటివ్ కారణంగా కొన్ని రోజులు సినిమా షూటింగ్‌కి బ్రేకులిచ్చేశారు. ఈ మధ్యనే కోవిడ్ నుంచి కోలుకున్న బాలయ్య మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశారు.

ఈ లోపు సినిమా యూనిట్‌లో ఇంకొకరికి కోవిడ్ పాజిటివ్ అని తేలిందట. దీంతో మళ్లీ షూటింగ్ ఆపేయాల్సి వచ్చిందట. ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘జై బాలయ్య’ అనే టైటిల్ ఈ సినిమాకి ఫిక్స్ చేశారు.

బాలయ్యా..! ఇలా అయితే ఎలాగయ్యా.!

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి బ్రేకుల మీద బ్రేకులు పడడంతో సినిమాని అనుకున్న టైమ్‌కి పూర్తి చేసే అవకాశాలు కనిపించడం లేదట. ఈ పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో, మళ్లీ షూటింగ్ ఎప్పుడు ట్రాక్ ఎక్కుతుందో తెలియని గందరగోళంలో బాలయ్య అండ్ టీమ్ వున్నారట. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

The Shooting Of Jai Balayya Movie Broke

The Shooting Of Jai Balayya Movie Broke

మరోవైపు ఈ సినిమా సెట్స్‌పై వుండగానే, బాలయ్య, అనిల్ రావిపూడితో ఇంకో సినిమాకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు పట్టాలెక్కించాలా.? అని అనిల్ రావిపూడి ఎదురు చూస్తున్నాడు. బాలయ్యతో సినిమా చేయాలని అనిల్ రావిపూడి ఎప్పుడో కథ సిద్ధం చేసుకున్నాడట.

సో, పెద్దగా గ్రౌండ్ వర్క్ లేకుండానే ఈ సినిమాని స్టార్ట్ చేసేస్తాడు అనిల్ రావిపూడి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కాస్టింగ్, కథా, కథనాల విషయంలో ఓ క్లారిటీ ఇచ్చేశాడు కూడా. తండ్రీ కూతురు సెంటిమెంట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ఇది. శ్రీలీల ఈ సినిమాలో బాలయ్యకి కూతురుగా నటిస్తోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us