Jabardasth Show : రోజా స్థానాన్ని ఇంద్రజతో భర్తీ చేయబోతున్నారా.. పోటీలో మరో భామ..!
NQ Staff - April 13, 2022 / 05:38 PM IST

Jabardasth Show : ఒకప్పుడు హీరోయిన్‌గా అదరగొట్టిన రోజా ఇప్పుడు రాజకీయ నాయకురాలిగా, బుల్లితెర జడ్జిగా అదరగొడుతుంది. అయితే ఇన్నాళ్లు రాజకీయం చేస్తూ మరోవైపు బుల్లితెరపై సందడి చేసింది. అయితే ఇక నుండి తాను పూర్తిగా రాజకీయాలతోనే బిజీ కానుంది. ఆర్కే రోజా అనే నేను.. ఆంధ్రప్రదేశ్ టూరిజం , సాంస్కృతిక, యువజన సర్వీసులు శాఖ మంత్రిగా బాధ్యతల్ని నిర్వర్తిస్తానంటూ నిన్నటి మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రమాణం చేసేశారు రోజా.
మంత్రిగా యాక్షన్‌లోకి దిగారో లేదు.. ఇలా జబర్దస్త్ యాక్షన్‌కి కట్ చెప్పేశారు. మంత్రిగా పూర్తి బాధ్యతల్ని నిర్వర్తించడంలో భాగంగా.. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఇతర టీవీ షోలు, సినిమాలు చేయనని చెప్పేశారు. రోజా జబర్దస్త్ జడ్జ్‌గా వైదొలగిన నేపథ్యంలో- ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
సుదీర్ఘకాలం పాటు రోజా ఈ కార్యక్రమంతో అసోసియేట్ అయి ఉన్నారు. 2013 నుంచీ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ వచ్చారు. సినిమాల్లో అవకాశాలు తగ్గి- దాదాపు తెరమరుగైన పరిస్థితుల్లో జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా మళ్లీ వెలుగులోకి వచ్చారు రోజా. ప్రతి తెలుగింటినీ పలకరించారు. తోటి నటుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకుడుతో కలిసి న్యాయ నిర్ణేతలుగా పని చేశారు. జబర్దస్త్- మరింతగా జనంలోకి చొచ్చుకెళ్లడంలో ఆమె తనవంతు కీలక పాత్రను పోషించారు.

The names Indraja and Amani are heard in Roja Place on the Jabardasth Show
మంత్రిగా బాధ్యతలను నిర్వహించాల్సి ఉన్నందున ఆ హోదాకు తగ్గట్టుగా వ్యవహరించాల్సి ఉంటుందనే కారణంతో స్వచ్ఛందంగా షోలు చేయనుంటూ వైదొలిగారు. దీనితో ఆమె వారసులు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ విషయంలో రెండు పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఒకటి- ఇంద్రజ, రెండు- ఆమని. వీరిద్దరిలో ఒకరితో ఆ ఛానల్ యాజమాన్యం కాంట్రాక్ట్ కుదుర్చుకునే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. ఇందులో ఇంద్రజ వైపే మొగ్గు చూపుతుందని అంటున్నారు.
ఇదివరకు రోజా అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. చెన్నైలో శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం కొన్ని వారాల పాటు రోజా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో రోజా స్థానాన్ని ఇంద్రజ భర్తీ చేశారు. జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో మెరుపులు మెరిపించారు. ఆ అనుభవం ఉండటం వల్ల ఇప్పుడు ఇంద్రజ- పూర్తిస్థాయిలో న్యాయనిర్ణేతగా పని చేసే అవకాశాలు లేకపోలేదంటూ తెలుస్తోంది.