South Movies : విలవిల‌మంటున్న బాలీవుడ్ బాక్సాఫీస్.. వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్న సౌత్ సినిమాలు

NQ Staff - August 14, 2022 / 01:45 PM IST

151583South Movies  : విలవిల‌మంటున్న బాలీవుడ్ బాక్సాఫీస్.. వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్న సౌత్ సినిమాలు

South Movies  : ఒక‌ప్పుడు బాలీవుడ్ సినిమా విడుద‌ల అవుతుంది అంటే ఆ సినిమా కోసం యావ‌త్ దేశం ఆసక్తిగా ఎదురు చూసేది. కాని ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. రోజు రోజుకీ బాలీవుడ్ సినిమా ప్రేక్షకుడికి దూరమవుతుందా అంటే అవుననే అంటున్నారు మూవీ లవర్స్. ఎందుకంటే భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమాలెన్నో బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడుతున్నాయి. లేటెస్ట్ గా అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ కూడా ఫ్లాప్ లిస్ట్ లో చేరి బాలీవుడ్ ఇండస్ట్రీకి షాకిచ్చాయి.

The Collections Of South Movies Succecess Creating

The Collections Of South Movies Succecess Creating

క‌ళ త‌ప్పిన బాలీవుడ్..

ఈనెల 11న బాలీవుడ్ నుంచి రెండు భారీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటేమో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా, రెండు బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ నటించిన రక్షా బంధన్. ఇద్దరూ సూపర్ స్టార్ సినిమాలు కావడంతో భారీ ఓపెనింగ్స్ ఉంటాయనుకున్నారంతా. కాని అత్యల్ప ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ ముందు బ్లాస్ట్ అయిపోయాయి.

ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా కూడా బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర తేలిపోతున్నాయి. సక్సెస్‌ సౌండ్ ఇటీవ‌ల‌ వినిపించక పోవటంతో మంచి రోజులెప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారు నార్త్ ఆడియన్స్‌. ఇక సౌత్ సినిమాల విష‌యానికి వ‌స్తే ఈ సినిమాలు వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్నాయి. రీసెంట్‌గా విడుద‌లైన సినిమాల‌కు ప్రేక్ష‌కులు నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు.

The Collections Of South Movies Succecess Creating

The Collections Of South Movies Succecess Creating

రీసెంట్‌గా తెలుగు లో కార్తికేయ 2, తమిళం లో కార్తి విరుమన్, మలయాళం లో టోవినో థామస్ నటించిన తాళ్లూమాల చిత్రాలు విడుద‌ల కాగా, ఇవి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ దుమ్ము రేపుతున్నాయి. నాలుగు రోజులు సెలవులు కలిసిరావడం తో సౌత్ లో విడుదల అయిన మూడు చిత్రలకు ఫుల్లు కలెక్షన్స్ వస్తున్నాయి. తమిళం లో కార్తి విరుమన్ బీసీ ఆడియన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాడు.

The Collections Of South Movies Succecess Creating

The Collections Of South Movies Succecess Creating

మలయాళంలో టోవినో కూడా అంతె.. తెలుగులో కార్తికేయ 2 తొ పాటు సీతా రామం, బింబిసారా స్టడీగా వసూళ్లను అందుకుంటున్నాయి. చూస్తుంటే రానున్న రోజుల‌లో సౌత్ సినిమాలు బాలీవుడ్‌ని శాసించే స్థాయికి వెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.