Kantara Movie : రియల్‌ లైఫ్‌ లో కాంతార క్లైమాక్స్‌ చూసిన రిషబ్ శెట్టి.. సేమ్ సినిమాలో జరిగినట్టే..!

NQ Staff - January 21, 2023 / 11:38 AM IST

Kantara Movie : రియల్‌ లైఫ్‌ లో కాంతార క్లైమాక్స్‌ చూసిన రిషబ్ శెట్టి.. సేమ్ సినిమాలో జరిగినట్టే..!

Kantara Movie : గత కొంత కాలంగా కాంతార సినిమా గురించి దేశం మొత్తం చర్చించుకుంటుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి చిన్న సినిమాగా వచ్చిన కాంతార సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా ఏ భాషలో విడుదలైతే ఆ భాషలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తెలుగు నాట కూడా పెద్ద ఎత్తున హిట్ అయింది. దీంతో ఒక్కసారిగా రిషబ్ శెట్టి పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది.

కాగా ఈ సినిమాకు అత్యంత ప్లస్‌ అయింది అంటే క్లైమాక్స్‌ సీన్‌. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే సినిమా క్లైమాక్స్‌ మరో ఎత్తు అనే చెప్పుకోవాలి. ఇందులో భూతకోల ఆట చూసే వారి గుండెల్లో గుబులు పుట్టించింది. అంతగా అందులో జీవించేశాడు రిషబ్ శెట్టి. అయితే ఈ సినిమాలో జరిగిన సీన్‌ కాస్తా రియల్‌ లైఫ్‌ లో కూడా రిషబ్ శెట్టికి ఎదురైంది.

తులునాడులో ఉత్సవాలకు..

సినిమా ఇంత పెద్ద హిట్ అయిన సందర్భంగా రిషబ్ శెట్టి, హోంబలే నిర్మాతలు, మూవీ టీమ్‌ కలిసి తులునాడులో జరిగిన పంజుర్లీ ఉత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడో వ్యక్తి భూతకోల ఆడేందుకు ఓ వ్యక్తి ముందుకు వచ్చాడు. ఆయనకు పంజుర్లీ ఆవహించింది.

ఆ భూతకోల ఆడే వ్యక్తి ఆత్మీయంగా రిషబ్‌ శెట్టి దగ్గరకు వచ్చి ఆయన చేయి పట్టుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇదంతా వీడియో తీయడంతో ఆ వీడియోను హోంబలే సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us