Bigg Boss Season 6 : వాళ్లు ప్రేక్షకులు కాదు జూనియర్ ఆర్టిస్టులు.. హమ్మ బిగ్ బాసూ ఇక్కడ కూడా మోసమేనా!

NQ Staff - September 27, 2022 / 01:51 PM IST

Bigg Boss Season 6 : వాళ్లు ప్రేక్షకులు కాదు జూనియర్ ఆర్టిస్టులు.. హమ్మ బిగ్ బాసూ ఇక్కడ కూడా మోసమేనా!

Bigg Boss Season 6 : బిగ్ బాస్ అంటేనే మోసం అంటూ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. తెలుగు బిగ్ బాస్ ప్రారంభం అయినప్పటి నుండి కూడా చాలా మంది స్క్రిప్ట్ అంటూ విమర్శలు చేసిన వారు ఉన్నారు.

ఎలిమినేషన్ కి నామినేషన్ మొదలుకొని

టాస్కుల్లో గొడవలు, ఎలిమినేషన్ అయిన తర్వాత కంటెస్టెంట్స్ తో వివాదాస్పద వ్యాఖ్యలు చేయించడం ఇలా ప్రతీది కూడా ఒక డ్రామా అనేది చాలా మంది అభిప్రాయం.

ఆ విషయంలో ఇంకా అనుమానం ఉండగానే బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ లో ప్రేక్షకులు అంటూ స్టేజి ముందు కూర్చునే వారు జూనియర్ ఆర్టిస్టులు అని.. పెయిడ్ ఆర్టిస్టులు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చెక్కర్లు కొడుతోంది.

సామాన్య ప్రేక్షకులను లేదా కాలేజీ స్టూడెంట్స్ ని కాకుండా డబ్బులు ఇచ్చి జూనియర్ ఆర్టిస్టులను ప్రేక్షకులుగా తీసుకు వస్తున్నారంటూ తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల నాగార్జున పాల్గొన్న వీకెండ్ ఎపిసోడ్ లో ఒక అమ్మాయి కనిపించింది.

కంటెస్టెంట్స్ యొక్క ప్రవర్తన గురించి మాట్లాడిన సమయంలో ప్రేక్షకుల్లో ఉన్న వారు తమ అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా నాగార్జున అడిగినప్పుడు ఆ అమ్మాయి స్పందించింది. అదే అమ్మాయి శ్రీముఖి హోస్ట్ గా చేసిన స్టార్ మా పరివార్ లో కూడా ప్రేక్షకుల మధ్యలో ఉంది.. అంటే ఆ అమ్మాయి పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ ప్రచారం మొదలైంది.

కనీసం పేక్షకులనైనా నిజమైన వారిని తీసుకు రావచ్చు కదా బిగ్ బాస్.. ఎందుకు మరి ఇంతగా మోసం చేయడం అంటూ బిగ్ బాస్ నిర్వాహకులపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మోసాలు బిగ్ బాస్ లో ఎన్నో జరుగుతుంటాయి అందుకే మాకు బిగ్ బాస్ అంటే ఇష్టం ఉండదు అంటూ కొందరు ఇదే అదునుగా బిగ్ బాస్ ని ట్రోల్ చేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us