Television Anchors : బుల్లితెర యాంకరమ్మలు ఒకరోజుకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా..?
NQ Staff - March 8, 2023 / 05:30 PM IST

Television Anchors : ఇప్పుడు సినిమా స్టార్లకు సమానంగా బుల్లితెరపై రాణించే వారికి కూడా రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఎందుకంటే ఫోన్ల వినియోగం బాగా పెరిగిపోయిన తర్వాత.. బుల్లితెర ప్రోగ్రామ్ లకు కూడా ఆదరణ బాగా పెరిగిపోయింది. వ్యూస్ కూడా కోట్లలో వస్తున్నాయి. దాంతో బుల్లితెరపై రాణిస్తున్న యాంకరమ్మల రెమ్యునరేషన్ కూడా హీరోయిన్లను అందుకుంటోంది. మరి ఏ యాంకర్ ఎంత తీసుకుంటుందో చూద్దాం.
ముందుగా చెప్పుకోవాల్సింది యాంకర్ సుమ గురించి. ఆమె ఇప్పుడు టాలీవుడ్ లోనే టాప్ యాంకర్ గా దూసుకుపోతోంది. ఏ పెద్ద హీరో షో అయినా సరే ఆమెనే యాంకరింగ్ చేస్తోంది. దాంతో పాటు స్టార్ ప్రోగ్రామ్స్ కు కూడా ఆమెనే హోస్ట్ గా చేస్తోంది. అందుకే ఆమె ఒక్కో ఈవెంట్ కు రూ.4లక్షల దాకా తీసుకుంటోంది.
రష్మీ ఎంతంటే..?
ఇక ఆమె తర్వాత బాగా పాపులర్ అయింది అనసూయ. ఆమె జబర్దస్త్ తో ఫేమస్ అయిన విషయం తెలిసిందే. యాంకరింగ్ కు మసాలా అందాలను జోడించికుర్రాల్లను తన వైపుకుకు తిప్పుకున్న ఆనసూయ.. ఒక్కో షోకు రూ.3లక్షల వరకు తీసుకుంటోంది. ఇక ఆమె తర్వాత చెప్పుకోవాల్సింది యాంకర్ రష్మీ గురించి.
ఆమె కూడా బాగానే ఫేమస్అయింది. హీరోల ఈవెంట్లు చేయక పోయినా.. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలు చేస్తోంది. ఈ షోల ఒక్కో ఈవెంట్ కు రూ.2లక్షల వరకు ఆమె తీసుకుంటోంది. ఇక వీరిద్దరి తర్వాత శ్రీముఖి కూడా ఇప్పుడు బాగానే సంపాదిస్తోంది. ఆమె చేతిలో ఎక్కువ అవకాశాలు ఉన్నా సరే ఆమె మాత్రం రూ.2లక్షలు మాత్రమే తీసుకుంటోంది.