Krishnam Raju : అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు

NQ Staff - September 11, 2022 / 11:20 AM IST

Krishnam Raju  : అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు

Krishnam Raju  : అనారోగ్యంతో కన్ను మూసిన టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజుకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలియజేశారు. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో కృష్ణంరాజు ఎన్నో విలక్షణ పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారంటూ సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు

తీరని లోటు అంటూ ఆయన లోక్‌ సభ సభ్యునిగా కేంద్రమంత్రి సేవలందించిన కారణంగా ఆయనకు అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

Telangana government to conduct the last rites of Krishnam Raju with official invitations

Telangana government to conduct the last rites of Krishnam Raju with official invitations

కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షిస్తున్నట్లుగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కృష్ణంరాజు కి తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన అభిమానులు మరియు కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణంరాజు తనకు సన్నిహితుడని ఆయన కుటుంబం కూడా కావలసినదని కెసిఆర్ సన్నిహితుల వద్ద పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారంట. కృష్ణంరాజు మరియు కేసీఆర్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది టాలీవుడ్ మరియు రాజకీయ వర్గాల్లో సమాచారం.

రాజకీయాల్లో సేవలందించిన కృష్ణంరాజుకు తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించడం అనేది మంచి పని అన్నట్లుగా సినీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us