Tejaswi Madivada : తెలుగమ్మాయి తేజస్వి మదివాడలో మంచి టాలెంట్ ఉన్నా కూడా అదృష్టం లేకపోవడంతో అవకాశాలు తలుపు తట్టడం లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో వెండితెరకు పరిచయమైంది తేజస్విని మదివాడ . ఆ మూవీలో సమంత ఫ్యామిలీ మెంబర్ గా ఓ చిన్న పాత్రలో మెరిసింది. తర్వాత రామ్ గోపాల్ వర్మ ఐస్ క్రీమ్ మూవీలో హీరోయిన్ గా పూర్తి స్థాయి హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది.

తేజస్వి గ్లామర్ షో..
మనం, హార్ట్ అటాక్ లాంటి చిత్రాల్లో నటించి అలరించింది. ఐస్ క్రీం చిత్రంలో తేజస్వి ప్రధాన పాత్రలో బోల్డ్ గా నటించింది. ఇది తేజస్వికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. ఆమె కెరీర్ మొత్తం చిన్న చిన్న పాత్రలతోనే సరిపోయింది. పండగ చేస్కో,శ్రీమంతుడు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాల్లో ఆమె నటించారు.

కేరింత, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చిత్రాల్లో తేజస్విని కొంచెం ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశారు. ఎన్ని చిత్రాల్లో నటించినా ఆమె ఓ ఇమేజ్ తెచ్చుకోలేకపోయారు. ఆ కారణంగా తేజస్వినికి టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. అయితే ఊహించని విధంగా 2018లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు 2లో తేజస్విని అవకాశం దక్కింది.

పొట్టి బట్టలు ధరించి హౌస్ లో గ్లామర్ ఒలకబోసింది.ఈ షోతో అయిన కొంత క్రేజ్ పొందాలని ఈ ముద్దుగుమ్మ భావించగా, ఆమె గేమ్ నచ్చని జనాలు త్వరగానే బయటికి పంపేశారు. ఏడు వారాలు హౌస్ లో ఉన్న తేజస్వి అంతగా ప్రభావం చూపలేకపోయారు. రీసెంట్‌గా బిగ్ బాస్ నాన్‌స్టాప్ షోలోను సందడి చేసింది.
ఇది కూడా తనకు అనుకూలంగా మలచుకోలేకపోయింది తేజస్వి. ఇటీవల ఈ ముద్దుగుమ్మ తెగ ఫొటో షూట్స్ చేస్తూ నానా రచ్చ చేస్తుంది. తాజాగా బ్రౌన్ కలర్ డ్రెస్ లో తేజస్వి కిల్లింగ్ లుక్స్ తో కేక పెట్టిస్తోంది. జారిపోయేట్లుగా ఉన్న ఆ డ్రెస్ లో ఒకే ఒక్క బటన్ ఆధారంగా ఉంది. ఈ డ్రెస్ లో తేజస్వి మతిపోగోట్టే క్లీవేజ్ సాకులతో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం బ్యూటీ పిక్స్ వైరల్‌గా మారాయి.