Adipurush : ఆదిపురుష్.. నిజంగా రామాయణం కథనా?
NQ Staff - September 30, 2022 / 02:28 PM IST

Adipurush : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన బాలీవుడ్ చిత్రం ఆదిపురుష్ రామాయణం ఇతివృత్తంలో రూపొందుతుంది అంటూ మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. ఆ విషయంలో కొందరు అధికారికంగా ప్రకటించ లేదు కదా కనుక రామాయణం కథ పోలి కాస్త అటు ఇటుగా సినిమా ఉంటుంది అంటూ ప్రచారం చేస్తున్నారు.
రామాయణం కథతో చాలా సినిమాలు వచ్చాయి,
కానీ పౌరాణిక సినిమాలు కాకుండా ఆ తరహా కథలతో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆదిపురుష్ సినిమా కూడా కచ్చితంగా అలాంటిదే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అక్టోబర్ రెండవ తారీఖున సినిమా యొక్క టీజర్ విడుదల కాబోతుంది. ఆ సందర్భంగా నేడు ఉదయం ఒక పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది. అందులో ప్రభాస్ లుక్ చూస్తుంటే మనం రెగ్యులర్ గా చూసే రాముడి లుక్ లో లేడు అందుకే ఇది నిజమైన రామాయణం అయ్యి ఉండదు అంటూ కొందరు బలంగా వాదన వినిపిస్తున్నారు.
ఈ విషయమై చిత్ర యూనిట్ సభ్యుల యొక్క ప్రకటన ఏంటా అంటూ అంత ఆసక్తిగా చూస్తున్నారు. అక్టోబర్ 2వ తారీఖున టీజర్ విడుదల అయితే పూర్తి వివరాలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఈ సినిమాలో రాముడి పాత్ర ఉంటుంది కానీ రాముడు ఉండడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ట్విస్ట్ ఇస్తున్నారు. మొత్తానికి సినిమా ఎలా ఉంటుందా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూసేలా ప్రచారం జరుగుతోంది.
వచ్చే సంవత్సరం జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా మళ్లీ అధికారికంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.