Super Star Krishna : సీనియర్ నటుడు కృష్ణను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న డాక్టర్లు ఎంతమందో తెలుసా.?

NQ Staff - November 14, 2022 / 08:41 PM IST

Super Star Krishna  : సీనియర్ నటుడు కృష్ణను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న డాక్టర్లు ఎంతమందో తెలుసా.?

Super Star Krishna  : ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే వుంది. ఆయన్ని కాపాడేందుకు ప్రత్యేకించి ఓ డాక్టర్ల బృందం పని చేస్తోంది. కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ సహా, పలువురు స్పెషలిస్టులు ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఈ బృందం సమీక్షిస్తోంది.

మొత్తంగా 8 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఈ బృందంలో వున్నట్లు తెలుస్తోంది. వారిలో క్రిటికల్ కేర్ స్పెషలిస్టు కూడా వున్నారని కాంటినెంటల్ ఆసుపత్రి అధినేత వెల్లడించారు.

అత్యాధునిక వైద్యం అందుతున్న వైనం..

ప్రపంచ స్థాయి అత్యాధునిక వైద్యాన్ని సూపర్ స్టార్ కృష్ణకు అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ పర్యవేక్షణలో 8 మంది డాక్టర్ల బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై అంచనా వేస్తోందనీ, అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నామని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

ఆయన కోలుకోవాలని అందరం ప్రార్థిద్దామంటున్న వైద్యులు, ఆయన కోలుకోవడానికి శక్తివంచన లేకుండా తాము కృషి చేస్తున్నట్లు వివరించారు. ప్రతి గంటా అత్యంత కీలకమని చెబుతున్నారు వైద్యులు. వెంటిలేటర్ మీదనే ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us