Ram Charan Teja : రామ్ చరణ్ ఇంటికి టీమిండియా.! పడి ఏడుస్తున్న నందమూరి ఫ్యాన్స్.!

NQ Staff - September 26, 2022 / 06:38 PM IST

Ram Charan Teja : రామ్ చరణ్ ఇంటికి టీమిండియా.! పడి ఏడుస్తున్న నందమూరి ఫ్యాన్స్.!

Ram Charan Teja : కొన్నాళ్ళ క్రితం సౌత్ సినిమా టాప్ డైరెక్టర్స్, టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని కలిస్తే, ఆ మీటింగుని మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేశారంటూ నందమూరి కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా వెటకారం చేస్తూ, రామ్ చరణ్ స్థాయిని తగ్గించేందుకు ప్రయత్నించారు.

ఇప్పుడేమో, టీమిండియా క్రికెటర్లు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి వెళ్ళారు. ఈ విషయమై నందమూరి అభిమానులు ఏమంటారు.? ఇది కూడా, చిరంజీవి ఏర్పాటు చేసిందేనని అనగలరా.?

చిరంజీవి అలా.. రామ్ చరణ్ ఇంకోలా..

మెగాస్టార్ చిరంజీవికి సన్నిహితులు ఎక్కువ. సచిన్ టెండూల్కర్, సల్మాన్ ఖాన్, రజనీకాంత్.. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలామంది ప్రముఖులతో చిరంజీవికి సన్నిహిత సంబంధాలున్నాయి. అంతకు మించి, రామ్ చరణ్.. ప్రముఖులతో రిలేషన్స్ మెయిన్‌టెయిన్ చేస్తుంటాడు.

సల్మాన్ ఖాన్ ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటించడానికి కారణం రామ్ చరణ్. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ సినిమా ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’కి తెలుగులో చరణ్ డబ్బింగ్ చెప్పాడు.
రామ్ చరణ్ కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, అంతకు మించి.! చిరంజీవిలాగానే కాదు, అంతకు మించి.. హుందాతనం కలిగినోడు. ఎన్టీయార్, మహేష్, ప్రభాస్.. ఇలా అందరితోనూ చరణ్‌కి సన్నిహిత సంబంధాలున్నాయ్. వాళ్ళంతే.. వాళ్ళ పైత్యమూ అంతే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us