TDP : గరికపాటి రగడ.! టీడీపీకి ఎందుకంత అత్యుత్సాహం.?
NQ Staff - October 7, 2022 / 07:09 PM IST

TDP : మెగాస్టార్ చిరంజీవి విషయంలో ప్రచవనకారుడు గరికపాటి నరసింహారావు అత్యుత్సాహం, అసహనం ప్రదర్శించారనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ‘చిరంజీవిగారూ మీరు ఫొటో సెషన్ ఆపుతారా.? నన్ను వెళ్ళిపోమంటారా.?’ అంటూ ఒకింత అసహనంతో కూడిన వ్యాఖ్యలే చేశారు గరికపాటి నరసింహారావు.
ఈ విషయంలో చిరంజీవి మాత్రం సంయమనం కోల్పోలేదు. హుందాతనమే ప్రదర్శించారు. కానీ, మెగాబ్రదర్ నాగబాబు అలాగే చిరంజీవి అభిమానులు చాలామంది గరికపాటి తీరుని సోషల్ మీడియా వేదికగా తప్పు పట్టారు. న్యూట్రల్‌గా వుండేవారు సైతం, గరికపాటిని ఈ విషయమై తప్పుపడుతూ, ఆయనపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
టీడీపీ ఎందుకు చిరంజీవిని ట్రోల్ చేస్తోంది.?
ఈ విషయంలో టీడీపీ సోషల్ మీడియా విభాగం, గరికపాటి నరసింహారావుకి మద్దతుగా నిలుస్తున్నట్లే కనిపిస్తోంది. టీడీపీ మద్దతుదారులంతా గంపగుత్తగా చిరంజీవిపై ట్రోలింగ్‌కి దిగుతున్నారు.
గరికపాటిని టీడీపీ మనిషిగా కొందరు పేర్కొంటున్నారు. ఒకప్పుడు తాను సీనియర్ ఎన్టీయార్ అభిమానిననీ, ఇతర హీరోల పోస్టర్లపై పేడ కొట్టేవాడినని కూడా ఆయన చెప్పిన వ్యాఖ్యల తాలూకు వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు టీడీపీ మద్దతుదారులు.
గరికపాటి కూడా టీడీపీ మనిషేనా.? ఆ అక్కసుతోనే చిరంజీవిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారని భావించాలా.? అన్న సందేహం కలుగుతోందిప్పుడు.