NTR : వైఎస్ జగన్ స్కెచ్.! బలి పశువుగా మారిన యంగ్ టైగర్ ఎన్టీయార్.!
NQ Staff - September 22, 2022 / 10:58 PM IST

NTR : ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా వైసీపీ సర్కారు మార్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం నిలబడుతుందా.? షరామామూలుగానే బ్యాక్ ఫైర్ అవుతుందా.? అన్నది ముందు ముందు తేలుతుంది. అయితే, ఈ వ్యవహారంలో టీడీపీ గింజుకోవడం మామూలే.

TDP leaders comments on NTR due to YS Jagan
కానీ, దెబ్బ గట్టిగా తగిలింది మాత్రం యంగ్ టైగర్ ఎన్టీయార్‌కే. సమీప భవిష్యత్తులో యంగ్ టైగర్ ఎన్టీయార్ గనుక టీడీపీ పగ్గాలు చేపడితే, రాజకీయంగా తనకు ఇబ్బందేనని బహుశా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావించి వుండొచ్చు.. ఆ క్రమంలోనే ‘కలుగులో వున్న ఎలుకకు పొగ పెట్టి, బయకు రప్పించినట్లుగా’ ఎన్టీయార్ యూనివర్సిటీ వివాదంతో యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని బయటకు లాగారు వైఎస్ జగన్.. అన్నది రాజకీయ, సినీ వర్గాల్లో వినిపిస్తోన్న వాదన.
ఎన్టీయార్ స్పందనతో టీడీపీలో గుస్సా..
తెలుగుదేశం పార్టీ నాయకులు కావొచ్చు, ఆ పార్టీ కార్యకర్తలు కావొచ్చు.. ఎవరూ ఎన్టీయార్ స్పందనని సమర్థించడంలేదు. ‘ఎన్టీయార్, వైఎస్సార్ ఒక్కటేనా.?’ అన్న దిశగా టీడీపీ శ్రేణులు, యంగ్ టైగర్ మీద విరుచుకుపడుతున్నారు.
సాధారణంగానే, టీడీపీ కార్యకర్తలు అలాగే నేతలు.. ఎన్టీయార్ సినిమాలపై నెగెటివ్ ట్రెండింగ్ చేస్తుంటారు. కానీ, ఎక్కడో ఓ మూల నందమూరి వారసుడన్న సాఫ్ట్ కార్నర్ వాళ్ళకి వుండేది నిన్న మొన్నటిదాకా. ఇకపై అదీ వుండదు. సో, టీడీపీ వైపు ఎన్టీయార్ చూడటానికీ ఆస్కారం వుండదు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కావాల్సింది కూడా అదే.! ఒక్క దెబ్బకి రెండు పిట్టలు.. ఓ వైపు స్వర్గీయ ఎన్టీయార్ ఇమేజ్ జీరో.. ఇంకో వైపు టీడీపీ దృష్టిలో జూనియర్ ఎన్టీయార్ జీరో.! వాట్ ఎ స్కెచ్ జగన్ సర్ జీ.!