Pushpa Movie : పుష్పతో పాటు ఆయ‌న టీంని ఆకాశానికి ఎత్తిన త‌మిళ హీరో..!

Pushpa Movie : 2021లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచిన పుష్ప సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తూనే ఉంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ కార్తీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. పుష్ప గా అల్లు అర్జున్ తన పాత్రలో పూర్తిగా ప్రవేశించాడని అరెస్టింగ్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టేసాడని అన్నారు.

tamil Hero karthi comments on allu arjun and Pushpa Movie
tamil Hero karthi comments on allu arjun and Pushpa Movie

అలాగే సుకుమార్ సార్ అయితే ప్రతి మూమెంట్ ని మనుషులతో ప్రెజెంట్ చెయ్యడంలో టాప్ నాచ్ లో చూపిస్తారు. కాస్ట్ అండ్ క్రూ ఈ సినిమాకి ఫెంటాస్టిక్ జాబ్ అందించారని తెలిపాడు. మరి దీనికి గాను అల్లు అర్జున్ రిప్లై ఇస్తూ ధన్యవాదాలు తెలియజేసాడు.

tamil Hero karthi comments on allu arjun and Pushpa Movie
tamil Hero karthi comments on allu arjun and Pushpa Movie

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. దానికి తగ్గట్లుగానే కలెక్షన్స్ కూడా వచ్చాయి. అఫీషియల్ గా 300 కోట్ల గ్రాస్ ఈ సినిమా వసూలు చేసిందని నిర్మాతలు ప్రకటించారు కూడా. పుష్ప సినిమాకు కలెక్షన్స్‌తో పాటు ప్రశంసలు కూడా అలాగే వస్తున్నాయి.

గతంలో అల్లు అర్జున్ సినిమాలు హిందీ డబ్బింగ్ వర్షన్ యూ ట్యూబ్‌లో విడుదలై మిలియన్స్ కొద్దీ వ్యూస్ అందుకున్నాయి. ఇప్పుడు థియేటర్స్‌లోనే పుష్ప అద్భుతమైన వసూళ్లు తీసుకురావడం అక్కడి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ పుష్ప సినిమా చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

ఇప్పుడు ఎక్క‌డ చూసిన పుష్ప సినిమా గురించే చ‌ర్చ జ‌రుగుతంది. ఇక హిందీ వెర్షన్ కోసం అక్కడ ఈ సినిమాను ప్రమోషన్‌ను చేసారు. దర్శకుడు సుకుమార్ లేకుండా.. అల్లు అర్జున్ అన్నీ తానై ఈ సినిమా ప్రమోషన్స్‌ను తన భుజాలపై మోస్తున్నాడనే చెప్పాలి. సుకుమార్ కూడా ఈ సినిమా కోసం లాస్ట్ వరకు కష్టపడ్డారు. ఈ సినిమాపై అన్ని వర్గాలు మంచి రెస్పాన్స్ వస్తోంది.