Tamannaah Bhatia : రూటు మార్చిన తమన్నా.. ఇంత పచ్చిగా రొమాన్స్ చేసిందేంటి..!
NQ Staff - June 7, 2023 / 09:26 AM IST

Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ అంటే మన సౌత్ ఇండస్ట్రీలో ఓ మంచి క్రేజ్ ఉంది. ఆమె ఇప్పటి వరకు పెద్దగా రొమాంటిక్ సీన్లలో నటించింది లేదు. ఇప్పటి వరకు లిప్ లాక్ లాంటి సీన్లు కూడా చేయలేదు. కానీ 18 ఏండ్లుగా వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఆమెతో పాటు ఎంట్రీ ఇచ్చిన వారికి పెళ్లిలు అయిపోయినా.. ఆమెకు మాత్రం అవకాశాలు అస్సలు తగ్గట్లేదు.
అయితే రెండేండ్లుగా ఆమెకు హీరోల సినిమాల్లో అవకాశాలు రావట్లేదు. దాంతో ఆమె ఇటు చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. వెబ్ సిరీస్ లలో సెన్సార్ రూల్స్ ఉండవు కాబట్టి ఎంత పచ్చిగా నటించినా ఓకే. కాగా ఇప్పుడు తమన్నా కూడా దీన్ని వాడుకుంటోంది. ఆమె కూడా గ్లామర్ కు హద్దులు చెరిపేస్తోంది.
అంతే కాదు ఎలాంటి రొమాంటిక్ సీన్లలో అయినా నటించేందుకు రెడీ అవుతోంది. తాజాగా తమన్నా నటించిన జీ కర్దా అనే వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూస్తూ తమన్నా ఎంతగా రూటు మార్చిందో అర్థం అవుతోంది. ఇందులో ఆమె బెడ్ రూమ్ సీన్లలో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. గతంలో ఎన్నడూ లేనంతగా దారుణంగా నటించింది.

Tamannaah Bhatia Getting Ready Act In Romantic Scenes
ఇంకా చెప్పాలంటే పచ్చిగా రెచ్చిపోయి నటించింది. ఇది చూసిన తమన్నా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు కాబోలు. చూస్తుంటే లస్ట్ స్టోరీస్ ఇంకా దారుణంగా రెచ్చిపోయి నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి తమన్నా చేసిన పాత్రపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.