Tamannaah Bhatia : బబ్లీ బౌన్సర్ కాదు.! తమన్నా అగ్లీ బౌన్సర్లు.! మీడియాపై దాడి.!

NQ Staff - September 17, 2022 / 05:39 PM IST

159188Tamannaah Bhatia  : బబ్లీ బౌన్సర్ కాదు.! తమన్నా అగ్లీ బౌన్సర్లు.! మీడియాపై దాడి.!

Tamannaah Bhatia  : మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో ‘బబ్లీ బౌన్సర్’ రూపొందిన సంగతి తెలిసిందే. ఈ ‘బబ్లీ బౌన్సర్’ ప్రమోషన్ల కోసం హైద్రాబాద్ వచ్చింది తమన్నా భాటియా.

ఈ క్రమంలోనే మీడియా ప్రతినిథులు (ఫొటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు) తమన్నా ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. అనంతరం బయటకు వస్తున్న తెలుగు మీడియా సిబ్బందిపై తమన్నా బౌన్సరులు విచక్షణారహితంగా దాడి చేశారు.

తొలుత వాగ్వివాదం.. ఆ తర్వాత దాడి..

Tamannaah Bhatia Bouncers Attacked Media

Tamannaah Bhatia Bouncers Attacked Media

మీడియాతో బౌన్సర్లు తొలుత వాగ్వివాదానికి దిగారు. అనంతరం దాడి చేశారు. ఊహించని ఈ పరిణామంతో మీడియా సిబ్బంది అవాక్కయ్యారు. నిర్వాహకులపై తెలుగు మీడియా ప్రతినిథులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఈ మొత్తం వ్యవహారంపై తమన్నా ఎలా స్పందిస్తుందోగానీ, మీడియా ప్రతినిథులపై సెలబ్రిటీల వ్యక్తిగత భద్రతా సిబ్బంది అనుచిత ప్రవర్తన ఇదే కొత్త కాదు. తరచూ ఇలాంటి ఘటనలు జరగడం, సెలబ్రిటీలు క్షమాపణ చెప్పడం అవాటుగా మారిపోయింది.

టైటిల్ ‘బబ్లీ బౌన్సర్’ అయినా, తమన్నా చుట్టూ వున్న బౌన్సర్లు మాత్రం చాలా అగ్లీగా (వికారంగా) ప్రవర్తించారు.