Talk Who Appeared Role Of Grandfather In Salaar Teaser : సలార్ టీజర్ లో ఉన్న ఈ తాత ఎవరో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
NQ Staff - July 6, 2023 / 07:17 PM IST

Talk Who Appeared Role Of Grandfather In Salaar Teaser
ఈ రోజు సోషల్ మీడియా మొత్తం ఒకటే విషయం గురించి డిస్కర్షన్ పెట్టిన విషయం తెలిసిందే.. సలార్ టీజర్ ఈ రోజు ఉదయాన్నే రిలీజ్ చేసారు. దీంతో ఈ టీజర్ మీదనే చర్చ నడుస్తుంది.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘సలార్’..
ఈ సినిమాపై ఎప్పటి నుండో అంచనాలు భారీగా పెరిగాయి.. ఈ షూట్ ఇటీవలే పూర్తి కాగా ఈ రోజు ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు.. టీజర్ తో ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసిన నీల్ సాలిడ్ అప్డేట్ అయితే ఫ్యాన్స్ కోసం వదిలాడు.. ఇక ఈ టీజర్ చూసిన వారంతా సినిమాపై మరింత అంచనాలు పెంచుకున్నారు..
కెజిఎఫ్ వంటి సిరీస్ తర్వాత నీల్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ మరింతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ రోజు రిలీజ్ చేసిన టీజర్ లో ప్రభాస్ విజువల్స్ చూపించక పోయిన కూడా ఈ టీజర్ కు అద్భుతమైన స్పందన లభిస్తుంది. ఇక ఈ సినిమా టీజర్ లో తాత రోల్ లో కనిపించిన నటుడు ఎవరు అంటూ టాక్ క్రేజీగా నడుస్తుంది.

Talk Who Appeared Role Of Grandfather In Salaar Teaser
ఆయన ఎవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ నటుడు టినూ ఆనంద్.. ఇతడు నటుడిగానే కాకుండా రచయితగా, డైరెక్టర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. పాన్ ఇండియా వ్యాప్తంగా ఎన్నో భాషల్లో నటించిన టినూ ఆనంద్ ఈ సినిమాలో కీ రోల్ పోషించినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ ను ఆకాశానికి ఎత్తుతూ ఎలివేషన్ ఇవ్వగా ఆకట్టుకుంటుందో చూడాలి..