Swathi muthyam Movie : ముందు రోజే రాబోతున్న బెల్లంకొండ బాబు.. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కదా?

NQ Staff - September 30, 2022 / 02:14 PM IST

Swathi muthyam Movie  : ముందు రోజే రాబోతున్న బెల్లంకొండ బాబు.. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కదా?

Swathi muthyam Movie  : బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా స్వాతిముత్యం సినిమాతో పరిచయం కాబోతున్నాడు. మొదటి సినిమాతోనే బెల్లంకొండ సాయి గణేష్ అందరి దృష్టిని ఆకర్షించాడు.

సాధారణంగా సినిమా విడుదలైన

తర్వాత అందరి దృష్టిని ఆకర్షిస్తారు, కానీ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు పోటీగా తన సినిమాను ప్రకటించడం ద్వారా బెల్లంకొండ సాయి గణేష్ అందరి దృష్టిని ఆకర్షించాడు అంటూ ఫిలిం సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది.

బెల్లంకొండ సాయి గణేష్ స్వాతిముత్యం సినిమాపై చిత్ర యూనిట్ సభ్యులకు ఉన్న నమ్మకం చూస్తుంటే ఆశ్చర్యం కలుగు తుంది. పెద్ద సినిమాలు కూడా ముందు రోజు ప్రీమియర్ వేయడానికి భయపడుతున్న రోజులు ఇవి.

అలాంటిది స్వాతిముత్యం సినిమాను విడుదలకు ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు వేయడానికి సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 4వ తారీఖున పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షో లు వేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

సినిమా ఫలితం కాస్త అటు ఇటు అయితే కచ్చితంగా డామేజ్ చాలా పెద్దగా ఉంటుంది.. అయినా కూడా చిత్ర యూనిట్ సభ్యులు తీసుకున్న ఈ నిర్ణయం సర్వత్ర ఉత్కంఠను కలిగిస్తోంది. కొందరు మాత్రం ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ విమర్శలు చేస్తున్నారు. మరి వారిది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా అనేది అక్టోబర్ 4 తారీఖున క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us