Swara Bhasker : క‌రోనా సోకిన న‌టిని చ‌చ్చిపొమ్మంటూ ట్రోలింగ్

Swara Bhasker : దేశంలో క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో సెల‌బ్స్ అంద‌రు క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి స్వర భాస్కర్ కి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తనను కలిసి వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

Swara Bhasker gets trolls on social media
Swara Bhasker gets trolls on social media

స్వర భాస్కర్ ఇంస్టాగ్రామ్ లో… ‘జనవరి 5న నిర్వహించిన వైద్యపరీక్షల్లో నాకు కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది.దీనితో 5వ తేదీ నుండి నేను, కుటుంబ సభ్యులు ఐసోలేషన్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఈ మధ్య నన్ను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలి’ అని సూచించింది. డబుల్‌ మాస్క్‌ దరించి సురక్షితంగా ఉండాలని, ఇప్పటికే డబుల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నందున త్వరలోనే నెగెటివ్ వ‌స్తుంద‌ని ఆశిస్తున్ని అని పేర్కొంది.

ఆమెను అభిమానించే వాళ్లు త్వరగా కోలుకోవాలని పోస్ట్‌లు పెడుతుంటే.. ద్వేషించే వాళ్లు మాత్రం త్వరగా చనిపో అంటూ దారుణంగా పోస్ట్‌లు పెడుతున్నారు. ఓవైపు కోవిడ్ సోకి అనారోగ్యంతో ఉన్న స్వరా భాస్కర్‌ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే స్వరా భాస్కర్ తనకి కోవిడ్ సోకిందని పోస్ట్ పెట్టడంతో ‘అడ్వాన్స్ రెస్ట్ ఇన్ పీస్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరికొంతమంది.. ‘త్వరగా చచ్చిపో.. నీలాంటి వాళ్లకి నరకంలో కూడా ప్లేస్ ఉండదు’ అంటూ అసభ్యకర కామెంట్లను పెడుతూ స్వరా భాస్కర్‌ని సామాజిక మాధ్యమాల్లో వేధిస్తున్నారు.

దీంతో స్వరా భాస్కర్.. తనపై వస్తున్న పోస్ట్‌లను స్క్రీన్ షాట్స్ తీసి తన ట్విట్టర్‌లో షేర్ చేసింది. తన ట్రోల్ చేయడం ద్వారా కొంతమంది కడుపు నింపుకుంటున్నారని.. నేను పోతే మీ కడుపు ఎలా నిండుతుంది.. అందుకే నేను బతకాలని కోరుకోండి అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది స్వరా భాస్కర్.