Sussanne khan: స్టార్ హీరో మాజీ భార్య‌కు కరోనా.. వైర‌స్ చాలా ప్ర‌మాద‌కరం అంటూ కామెంట్

Sussanne khan:క‌రోనా మ‌హ‌మ్మారి చాప‌కింద‌ర నీరులా విజృంభిస్తుంది. రోజురోజుకి క‌రోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్నిఇండ‌స్ట్రీల‌కు చెందిన సినీ ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది.

Sussanne khan gets corona
Sussanne khan gets corona

ఇటీవ‌ల బాలీవుడ్ లో కరీనాకపూర్‌, అర్జున్‌ కపూర్‌, ఏక్తా కపూర్‌, జాన్ అబ్రహం దంపతులు, మృణాళ్‌ ఠాకూర్‌, ఇషా గుప్తా, స్వరాభాస్కర్‌ తదితరులు కరోనా కోరలకు చిక్కారు. తాజాగా బాలీవుడ్‌ గ్రీక్‌ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య, ప్రముఖ ఇంటీరియర్‌ డిజైనర్‌ సుసానే ఖాన్‌ కొవిడ్‌ బారిన పడింది. ఈ విషయాన్నిఆమె సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది.

‘కరోనా నుంచి రెండేళ్లు తప్పించుకున్న తర్వాత మూడో సంవత్సరం ఈ మొండిఘటమైన ఒమిక్రాన్‌ నా రోగనిరోధక వ్యవస్థలోకి చొరబడింది. నేను సోమవారం రాత్రి పరీక్ష చేసుకోగా పాజిటివ్‌ అని తేలింది. ఇది చాలా ప్రమాదకరమైంది. దయచేసి అందరూ సురక్షితంగా ఉండి జాగ్రత్తలు తీసుకోండి.’ అని పోస్ట్‌ పెట్టింది సుసానే.

Sussanne khan gets corona2
Sussanne khan gets corona2

సుసానే ఖాన్ పోస్ట్ త‌ర్వాత ప‌లువురు ప్ర‌ముఖులు ఆమె త్వ‌ర‌గా కోలుకోవాలి అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. త్వరగా కోలుకోండి’ అని బ్యూటీ బిపాసా బసు రాయగా, ‘మీరు త్వరలో కోలుకుంటారు’ అని సుసనే సోదరి ఫరా ఖాన్‌ అలీ కామెంట్‌ పెట్టారు. ఇక సుసానే విష‌యానికి వ‌స్తే ఆమె కొన్ని సంవ‌త్సరాల క్రితం హృతిక్‌కి విడాకులు ఇచ్చింది.

హృతిక్ నుండి విడిపోయిన‌ప్ప‌టికీ అప్పుడ‌ప్పుడు పిల్ల‌ల కోసం క‌లుస్తూనే ఉంటుంది. జ‌న‌వ‌రి 10న హృతిక్ బ‌ర్త్ డే సందర్భంగా ‘నువ్వు చాలా అద్భుతమైన తండ్రివి. నీలాంటి తండ్రి ఉండటం రే అండ్‌ రిడ్జ్‌ల అదృష్టం. నీ కలలన్నీ నెరవేరుతాయి. ఇప్పటికీ ఎప్పటికీ బిగ్‌ హగ్‌ ‘ అంటూ మాజీ భర్తకు బర్త్‌ డే విషెస్‌ చెప్పుకొచ్చింది సుసానే.