Surender Reddy : సురేంద‌ర్ రెడ్డితో విభేదాలు.. ఆగ‌స్ట్‌లో ఏజెంట్ రావ‌డం లేద‌న్న వార్త‌ల‌పై క్లారిటీ..!

NQ Staff - May 17, 2022 / 08:49 PM IST

Surender Reddy : సురేంద‌ర్ రెడ్డితో విభేదాలు.. ఆగ‌స్ట్‌లో ఏజెంట్ రావ‌డం లేద‌న్న వార్త‌ల‌పై క్లారిటీ..!

Surender Reddy : అక్కినేని నాగార్జున త‌న‌యుడు అఖిల్ మంచి స‌క్సెస్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో ఆయ‌న‌కు మోస్ట్ ఎలిబిజుల్ బ్యాచిల‌ర్ చిత్ర రూపంలో ఒక మంచి హిట్ ద‌క్కింది. అదే ఉత్సాహంతో సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏజెంట్ అనే చిత్రం చేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా ఏజెంట్ సినిమా విడుదల విషయంలో అనేక రకాల ప్రచారాలు మొదలయ్యాయి.

Surender Reddy Agent movie release clarity

Surender Reddy Agent movie release clarity

సోషల్ మీడియాలో ప్రచారం మొదలైన ఈ ప్రచారం వెబ్ మీడియాకు కూడా పాకడంతో అనేక రకమైన కథనాలు వచ్చాయి. ఇంకా ఏజెంట్ సినిమా షూటింగ్ బాకీ ఉందని అయితే కొన్ని అనుకోని కారణాలతో ప్రొడక్షన్ టీంకి దర్శకుడు సురేందర్ రెడ్డికి విభేదాలు వచ్చాయి అని ప్రచారం జరిగింది. అందుకే షూటింగ్ విషయంలో అనుకున్న దానికంటే బాగా డిలే అవుతోందని, అందుకే ప్రకటించిన మేరకు ఆగస్టు నెలలో సినిమా విడుదలయ్యే అవకాశాలు లేవు అంటూ ప్రచారం జరిగింది.

Surender Reddy Agent movie release clarity

Surender Reddy Agent movie release clarity

ఇలాంటి వార్త‌ల‌పై అక్కినేని అభిమానులు ఆందోళ‌న చెందారు. ఈ క్రమంలో ఏజెంట్ సినిమా ఆగస్టు లో రావడం లేదు అంటూ మీడియాలో వస్తున్న వార్తలకు యూనిట్ సభ్యులు స్పందించారు. నిర్మాత అనీల్ సుంకర స్పష్టంగా మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దంటూ విజ్ఞప్తి చేశాడు. ఆయన ఖచ్చితంగా సినిమా ను ఆగస్టులోనే తీసుకు వస్తామన్న హామీని ఇచ్చారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఏజెంట్ సినిమా బడ్జెట్ విషయంలో కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

వాటన్నింటికి కూడా నిర్మాత చాలా క్లియర్ గా స్పష్టతను ఇచ్చాడు. మీడియాలో ఏజెంట్ గురించి వస్తున్న పుకార్లు నిజం కాదు.. సినిమా అన్ని అనుకున్నట్లుగా జరుగుతున్నాయి అనే స్పష్టత ఇచ్చాడు. మొత్తానికి అఖిల్ ఏజెంట్ విషయంలో అభిమానుల ఆందోళనకు.. విడుదల తేదీ పై ఉన్న గందరగోళం కు చిత్ర నిర్మాత ఒక స్పష్టత ఇవ్వడంతో పుకార్లకు చెక్ పెట్టినట్లు అయ్యింది.

చాలా విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టీ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అతి త్వరలోనే చివరి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారట. దాంతో సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఆగస్టు లో చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.. వాటితో ఏజెంట్ ఏ మేరకు పోటీ పడేనో చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us