Superstar Upendra : షూటింగ్‌ సందర్భంగా సూపర్‌ స్టార్ కి తీవ్ర అస్వస్థత

NQ Staff - November 25, 2022 / 11:42 AM IST

Superstar Upendra  : షూటింగ్‌ సందర్భంగా సూపర్‌ స్టార్ కి తీవ్ర అస్వస్థత

Superstar Upendra  : కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తీవ్ర అనారోగ్య సమస్య లతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. షూటింగ్ సమయం లో ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని కన్నడ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

డస్ట్ ఎలర్జీ ఉన్న ఉపేంద్ర ఒక సినిమా యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సందర్భంగా అస్వస్థతకు గురి అయ్యారని సమాచారం అందుతుంది. యాక్షన్ సన్నివేశాలను దుమ్ము దూళి లో చిత్రీకరిస్తున్న సందర్భం గా ఒక్కసారిగా ఆయన అస్వస్థతకు గురయ్యారు.

దాంతో వెంటనే స్థానిక హాస్పిటల్ లో జాయిన్ చేసి చికిత్స అందించి వైద్యులు ఆ తర్వాత డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని షూటింగ్లకు కూడా హాజరవుతున్నారని సమాచారం.

ఉపేంద్ర అనారోగ్య పరిస్థితుల నేపథ్యం లో ఆయన అభిమానులతో పాటు కన్నడ సినీ ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us