Super Star Krishna : తల్లడిల్లిపోయిన మహేష్.! ఈ కష్టం పగవాడిక్కూడా రాకూడదు.!

NQ Staff - November 16, 2022 / 08:27 PM IST

Super Star Krishna : తల్లడిల్లిపోయిన మహేష్.! ఈ కష్టం పగవాడిక్కూడా రాకూడదు.!

Super Star Krishna : తెరపై హీరోయిజం చూపించడంలో మహేష్‌బాబు తర్వాతే ఎవరైనా.. అనేంతలా ఆయన తన సినిమాల్లో సత్తా చాటుతుంటాడు. రీల్ హీరో అయినా.. రియల్ లైఫ్‌లో ఓ మామూలు ‘కొడుకు’ కదా.!
ఔను, సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్‌బాబు తన తండ్రి మరణాన్ని అస్సలు జీర్ణించుకోలేక పోతున్నాడు. అత్యంత ఆప్తులు ఎవరు తనను ఓదార్చేందుకు వచ్చినా, వారి ముందు కన్నీళ్ళు ఆపుకోలేకపోతున్నాడు మహేష్.

అంత్యక్రియల సమయంలో..

కృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిశాయి. అంత్యక్రియల సమయంలో మహేష్‌ని ఓదార్చడం ఎవరితరమూ కాలేదట. ఈ మొత్తం వ్యవహారాన్ని లైవ్‌లో చూపించేందుకు కృష్ణ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దాంతో, వారి విజ్ఞప్తి మేరకు మీడియా కూడా సంయమనం పాటించక తప్పలేదు.

నిజానికి, అంత్యక్రియల సమయంలో మీడియాని కూడా లోపలికి రానివ్వలేదు. మహేష్‌ అంతలా బాధపడుతుండడాన్ని చూసి, అక్కడున్నవారు చాలా చాలా ఆవేదన చెందారట. కొన్నాళ్ళ క్రితం సోదరుడు రమేష్‌బాబుని కోల్పోయాడు మహేష్. ఆ తర్వాత తల్లి ఇందిరా దేవి మృతి చెందారు.

ఇప్పుడు తండ్రి కృష్ణ కూడా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు.‘నీకు మేమున్నాం..’ అంటూ అభిమానులే కాదు, పరిశ్రమ పెద్దలూ మహేష్‌ని అండగా నిలుస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us