Darja Movie : ‘దర్జా’గా సర్‌ప్రైజ్ ఇస్తామంటోన్న అనసూయ, సునీల్.!
NQ Staff - July 11, 2022 / 09:17 AM IST

Darja Movie : ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్‌లో దాక్షాయణి, మంగళం శీను పాత్రలు పోషించిన సునీల్, అనసూయలు ఆ తర్వాత కలిసి ‘దర్జా’గా సినిమాలు చేసేస్తున్నారు. అదేనండీ సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో ‘దర్జా’ అనే మూవీ రూపొందుతోంది.

Sunil and Anasuya Darja movie
ఈ సినిమాని ఎప్పుడో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ, కుదరలేదు. ఈ నెల అంటే, జూలై 22న ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది ఈ సినిమా. అంతా బాగానే వుంది. కానీ, ఇప్పుడప్పుడే వస్తుందో రాదో, అనుకున్న సినిమాకి బాగానే స్లాట్ దొరికేసింది.
దర్జాగా సర్‌ప్రైజ్..
ఈ టైమ్‌ని బాగా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు చిత్ర యూనిట్. ‘పుష్ప’ లో సునీల్, అనసూయ పాత్రల పేర్లు ఎంతలా పాపులర్ అయ్యాయో తెలిసిన సంగతే. దాంతో, ఆ పేర్లతోనే ఈ ‘దర్జా’ సినిమాని డిఫరెంట్‌గా ప్రమోట్ చేసుకోవాలని ‘దర్జా’ టీమ్ భావిస్తోందట.
ఇన్నోవేటివ్ థాట్స్‌తో చిన్న సినిమాలను పెద్దగా ప్రమోట్ చేయడానికి ఈ మధ్య ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, ‘దర్జా’ మూవీ ప్రమోషన్స్‌లోనూ రకరకాల సర్ప్రైజ్ లతో షాకివ్వనున్నారట.
అన్నట్లు ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమాలోనూ అనసూయ, సునీల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప’ పార్ట్ 2 సంగతేమో కానీ, ఆ మేనియాని ఉపయోగించుకోవడంలో అవకాశమున్న సినిమాలూ, ఇతరత్రా బుల్లితెర రియాల్టీ షోలు మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా భలే వాడేసుకుంటున్నాయ్‌లే.