Suma Kanakala And Anasuya Bharadwaj : వీడియో : క్యాష్ జబర్దస్త్‌ కలిసి స్టెప్స్ వేస్తే ఇలా ఉంటుంది

NQ Staff - September 27, 2022 / 11:18 AM IST

Suma Kanakala And Anasuya Bharadwaj : వీడియో : క్యాష్ జబర్దస్త్‌ కలిసి స్టెప్స్ వేస్తే ఇలా ఉంటుంది

Suma Kanakala And Anasuya Bharadwaj : ఈటీవీలో చాలా ఫేమస్ షో లు అయినా జబర్దస్త్ మరియు క్యాష్ కార్యక్రమాల యొక్క యాంకర్స్ కలిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.. వీరిద్దరి నిజంగానే కలిశారు, తాజాగా ఒక సందర్భంగా వీరిద్దరూ కలిసి సరదాగా డాన్స్ కూడా చేశారు.

ప్రస్తుతం జబర్దస్త్ నుండి అనసూయ దూరమైనప్పటికీ

ఆమెను అంతా కూడా జబర్దస్త్ అనసూయ అనే పిలుస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు. ఈటీవీ నుండి అనసూయ వెళ్ళి పోయినప్పటికీ అక్కడున్న వారందరితో కూడా ఆమెకు సన్నిహిత సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయి.

ప్రత్యేక సందర్భాలు, ప్రత్యేక కార్యక్రమాల్లో అనసూయ ఎప్పటికప్పుడు పాల్గొంటూ అందరిని ఆకట్టుకుంటూనే ఉంటుంది. తాజాగా ఒక ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా సుమ  మరియు అనసూయ లు కలిశారు. ఆ సందర్భంగా ఒక పాటని తీసుకొని ఫన్నీ డాన్స్ మూవ్మెంట్స్ తో సోషల్ మీడియా ఫాలోవర్స్ ని నవ్వించేలా స్టెప్స్ చేశారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక అనసూయ జబర్దస్త్ వీడిన తర్వాత స్టార్ మా లో బిజీ అవుతుంది అని అంతా భావించారు, కానీ అక్కడ ఆమెకు పెద్దగా స్కోప్ లేదు అని తేలిపోయింది, మరో వైపు నటిగా బిజీ అవ్వాలి అనుకుంటే ఆంటీ వివాదం కారణంగా ఆఫర్లు తగ్గాయి. దాంతో ప్రస్తుతానికి అనసూయ కాస్త సైలెంట్ గానే ఉంది మరో వైపు సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం లేదా షో తో బిజీగానే ఉంటుంది.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us