Suma And Puri Jagannadh : ఆడియో ఫంక్షన్ కి వచ్చిన క్రౌడ్ చూసి భయపడి వెళ్ళిపోయిన సుమ ఎప్పుడో తెలుసా..?
NQ Staff - August 23, 2022 / 01:13 PM IST

Suma And Puri Jagannadh : యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన ‘ఆంధ్రావాలా’ సినిమా గుర్తుందా.? అప్పట్లో ఆ సినిమా విడుదలకు ముందు నడిచిన హంగామా అంతా ఇంతా కాదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీయార్, రక్షిత జంటగా నటించిన సినిమా అది.
కనీ వినీ ఎరుగని రీతిలో అప్పట్లో ఈ సినిమాపై ప్రీ రిలీజ్ హైప్ క్రియేట్ అయ్యింది. నాలుగు ట్రెయిన్లు ఏర్పాటు చేశారు.. ఈ సినిమా ప్రమోషన్ కోసం. అభిమానుల్ని ఉర్రూతలుగించింది అప్పట్లో ఈ సినిమా ప్రచారం కోసం రచించిన వ్యూహం.
గుర్తు చేసుకున్న సుమ, పూరి జగన్నాథ్..

Suma And Puri Jagannadh Remembered Movie Andhrawala In Promotions Of Liger
తాజాగా ‘లైగర్’ సినిమా ప్రమోషన్లలో ‘ఆంధ్రావాలా’ సినిమా గురించి గుర్తు చేసుకున్నారు యాంకర్ సుమ, దర్శకుడు పూరి జగన్నాథ్. ఓ ట్రెయిన్‌కి ఇన్‌ఛార్జిగా తాను వున్నాననీ, అయితే.. తాను ఆ అభిమాన సందోహం నడుమ, నిమ్మకూరు వెళ్ళలేకపోయానని సుమ చెప్పుకొచ్చింది.
‘అప్పట్లోనే ఎన్టీయార్ మాస్ పవర్ అలా వుండేది..’ అంటూ పూరి జగన్నాథ్ వ్యాఖ్యానించారు. ‘ఆంధ్రావాలా’ సినిమా అప్పట్లో చాలా పెద్ద డిజాస్టర్. అయినాగానీ, ఎన్టీయార్ మాస్ పవర్ ఏంటో ఆ సినిమా చుట్టూ నడిచిన హంగామాతో ప్రూవ్ అయ్యింది.
Range Of #Andhrawala Audio Launch @tarak9999 ??#ManOfMassesNTR pic.twitter.com/QHKmR79Ig9
— Troll NTR Haters (@TrollNTRHaterz) August 23, 2022