Sudigali Sudheer : సుధీర్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ గౌతమ్
NQ Staff - November 3, 2022 / 09:53 AM IST

Sudigali Sudheer : బుల్లితెర ప్రేక్షకులకు రష్మి గౌతమ్, సుధీర్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వారిద్దరి జోడి ని బుల్లి తెర ప్రేక్షకులు సుదీర్ఘ కాలంగా ఆదరించారు. ఇప్పటికీ కోరుతూనే ఉన్నారు.
వీరిద్దరూ రెగ్యులర్ గా ప్రేక్షకులను అలరించాలని, వీరిద్దరూ మళ్లీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావాలని అంతా కోరుకుంటూ ఉన్నారు. తాజాగా రష్మి గౌతమ్ హీరోయిన్ గా నందు హీరోగా రూపొందిన బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సుడిగాలి సుదీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రష్మీ గౌతమ్ కన్నీళ్లు పెట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. రష్మీ అంటే తనకు ఎంతో అభిమానం అని రష్మీ లేకపోతే సుధీర్ అనే వాడు లేడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు రష్మి గౌతమ్ ఎమోషనల్ అయ్యింది.
ఎప్పటిలాగే సుధీర్ చాలా ఫన్నీగా మాట్లాడుతూ అభిమానులను నవ్వించాడు. అయితే అతడి మాటలకు రష్మి గౌతమ్ కాస్త ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకోవడం అందరికీ అందరి దృష్టిని ఆకర్షించింది. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉందని.. ఎలాంటి ఇతర అంశాలు లేవని గతంలోనే పలు సార్లు వెళ్లడైంది. మరి ఎందుకు రష్మీ కన్నీళ్లు పెట్టుకుంది అనేది ఆమెకే తెలియాలి.