Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ క్రేజ్ చూసి అవాక్కైన రాఘ‌వేంద్ర‌రావు అండ్ టీం..ఆడిటోరియం ద‌ద్ద‌రిల్లిందిగా..!

NQ Staff - August 15, 2022 / 08:40 AM IST

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ క్రేజ్ చూసి అవాక్కైన రాఘ‌వేంద్ర‌రావు అండ్ టీం..ఆడిటోరియం ద‌ద్ద‌రిల్లిందిగా..!

Sudigali Sudheer : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర‌య్యాడు సుధీర్. టీమ్ లీడ‌ర్‌గా మంచి స్కిట్స్‌తో ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన వినోదం పంచాడు. త‌న‌లోని మ‌ల్టీ టాలెంట్ చూపిస్తూ స్టార్ ఇమేజ్ అందుకున్నాడు. ఇప్పుడు ప‌లు టీవీ షోల‌కి హోస్ట్‌గాను అద‌ర‌గొడుతున్నాడు.రోజురోజుకి సుడిగాలి సుధీర్ ఇమేజ్ పెరుగుతుండ‌డంతో హీరోగాను ఆయ‌న‌కి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి.

Sudigali Sudheer fans hungama

Sudigali Sudheer fans hungama

ఫుల్ క్రేజ్…

బుల్లితెరపై ఓ సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ సుడిగాలి సుధీర్‌ సొంతమంటే అతిశయోక్తి కాదు. సుధీర్‌ మెయిన్‌ లీడ్‌గా చేస్తున్న చిత్రం `వాంటెడ్‌ పండుగాడ్‌`. కె. రాఘవేంద్రరావు సమర్పణలో, శ్రీధర్‌ సీపాన రూపొందించిన చిత్రమిది. ఇందులో సుడిగాలి సుధీర్‌, సునీల్‌, అనసూయ, దీపికా పిల్లి వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. ఆగస్ట్ 19న విడుదల కానున్న ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్ జ‌రుపుకుంది. ఇందులో అనసూయ మాట్లాడుతున్నంత సేపు ఓ మాదిరిగా అరుపులు, ఈలలు, కేకలతో రచ్చ చేశారు.

దీంతో మధ్య లోనే అనసూయ తన ప్రసంగాన్ని ముగించింది. ఆమె వద్ద నుంచి మైక్‌ తీసుకుని అభిమానులను సముదాయించే ప్రయత్నం చేశారు కె. రాఘవేంద్రరావు. ఆయన కూడా వారిని వారించే ప్రయత్నంచేయగా, ఫ్యాన్స్ ఆగలేదు. దీంతో సుడిగాలి సుధీర్‌కి మైక్‌ ఇచ్చేశాడు రాఘవేంద్రరావు. పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల తరహాలో అరుపులతో మోతమోగించారు. దీంతో ప్రాంగణం మొత్తం దద్దరల్లినంత పనైంది. సుడిగాలి సుధీర్‌కి ఈ రేంజ్‌ ఫాలోయింగ్‌ ని చూసి రాఘవేంద్రావు, అనసూయ మాత్రమే కాదు, మిగిలిన వారంతా షాక్‌ అవుతున్నారు.

చివరగా మాట్లాడిన సుడిగాలి సుధీర్‌.. ఇప్పటికే ఏం మాట్లాడాలో తెలియక టెన్షన్‌గా ఉందని, మళ్లీ మీరు ఇలా అరిస్తే మరింత టెన్షన్‌గా ఉంటుందని చెప్పగా, కాస్త సైలెంట్‌ అయ్యారు. రాఘవేంద్రరావు సినిమాలు చూస్తూ పెరిగిన తాను.. ఇప్పుడు ఆయన సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు సుధీర్‌. ఈ చిత్రాన్ని థియేటర్లోనే చూసి ఆనందించాలని, మిగిలిన అన్ని సినిమాలను ఆదరించాలని తెలిపారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us